మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (18:39 IST)

బ్యాంకు వడ్డీ రేట్లలో మార్పులు లేవు : ఆర్.బి.ఐ

భారత రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్షను మంగళవారం చేపట్టింది. ఇందులో బ్యాంకుల వడ్డీరేట్లను యధాతథంగా ఉంచాలని ఆర్.బి.ఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్‌బీఐ (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) గవర్నర్‌ రఘురాం రాజన్‌ వెల్లడించారు. అలాగే, రెపో రేటును 8 శాతం వద్ద యధాతథంగా ఉంచినట్టు చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వడ్డీ రేట్లకు ఎలాంటి మార్పు చేయలేదని అన్నారు. అయితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆయన తెలిపారు. దాన్ని అదుపు చేసే చర్యలు చేపట్టామన్నారు. 2016 జనవరి నాటికి 6 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నట్లు రాఘురాం తెలిపారు.