శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2016 (09:15 IST)

బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు కొత్త రూల్... ఏటీఎం కార్డు తప్పనిసరి

ఇకపై బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేసేందుకు భారత రిజర్వు బ్యాంకు కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా ఏటీఎం కార్డును తప్పనిసరి చేసింది. అలాగే, థర్డ్ పార్టీ డబ్బును జమ చేయాలన్నా ఆథరైజేషన్ లెటర్

ఇకపై బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేసేందుకు భారత రిజర్వు బ్యాంకు కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా ఏటీఎం కార్డును తప్పనిసరి చేసింది. అలాగే, థర్డ్ పార్టీ డబ్బును జమ చేయాలన్నా ఆథరైజేషన్ లెటర్ ఉంటేనే జమ చేసేలా షరతు విధించింది. దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నగదు జమ అవుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ఇతరుల ఖాతాలను అక్రమంగా, లోపాయికారీగా అక్రమార్కులు వినియోగించుకుంటున్నారు. దీనిపై ఆర్బీఐ కన్నెర్రజేసింది. 
 
దీంతో ఎవరి ఖాతాలో నగదు జమ చేయాల్సి ఉంటుందో.. ఆయా ఖాతాదారుల నుంచి ఇకపై ఆథరైజేషన్‌ లెటరు తీసుకురావాల్సి ఉంది. ఈ నిబంధన విధిగా అమలు చేయాలని ఆర్బీఐ జిల్లాలోని బ్యాంకర్లను లీడ్‌ డిస్ట్రిక్ట్ మేనేజరు ద్వారా ఆదేశించింది. అక్రమ సంపాదన ఉన్న పెద్దలు ఇతరుల ఖాతాలను యథేచ్ఛగా వాడుకోవడంపై ఆర్బీఐ కొరడా ఝళిపించింది ఇప్పటికే ఈ విషయమై ఆదాయపు పన్ను శాఖ రంగంలో దిగి బ్యాంకర్లను అప్రమత్తం చేసింది.
 
అదేసమయంలో సీడీఎం(క్యాష్‌ డిపాజిట్‌ మిషన్‌) ద్వారా నగదు డిపాజిట్టు చేసే ఖాతాదారులకు ఏటీఎం కార్డును తప్పనిసరి చేసింది. ఏటీఎంల్లో ఈ 'ఆప్షన్‌'లో మార్పులు చేయాల్సిందిగా ఆదేశించింది. ఖాతాదారులు తమ ఖాతా నెంబరును ఎంటర్‌ చేసి సీడీఎంలో డబ్బు ఉంచగానే ఏటీఎం కార్డు ఇన్‌సర్ట్‌ చేయమని మెసేజ్‌ వస్తుంది. ఆ తర్వాత ఏటీఎం కార్డును ఇన్సర్ట్ చేశాకే డబ్బు డిపాజిట్ చేసేందుకు వీలుపడుతుంది.