శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 14 జనవరి 2017 (11:57 IST)

నోట్ల రద్దు వివరాల వెల్లడిస్తే.. వెల్లడించిన వారి ప్రాణాలకే ముప్పు.. పెద్ద నోట్లపై ఆర్బీఐ తలతిక్క జవాబు

భారత రిజర్వు బ్యాంకు అధికారులు కూడా ఇటీవలి కాలంలో తలతిక్క సమాధానాలు చెపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించే సమయానికి బ్యాంకుల వద్ద ఉన్న రూ.1000, రూ.500 నోట్ల సం

భారత రిజర్వు బ్యాంకు అధికారులు కూడా ఇటీవలి కాలంలో తలతిక్క సమాధానాలు చెపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించే సమయానికి బ్యాంకుల వద్ద ఉన్న రూ.1000, రూ.500 నోట్ల సంఖ్యకు సంబంధించిన వివరాలు ఇవ్వాలన్న ప్రశ్నకు ఆర్బీఐ అధికారులు విచిత్రంగా స్పందించారు. పెద్ద నోట్ల సంఖ్యకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తే.. వెల్లడించిన వారి ప్రాణాలకే ముప్పువాటిల్లే అవకాశముందని పేర్కొన్నారు. 
 
బ్లూంబర్గ్‌ న్యూస్‌ అనే వార్తాసంస్థ.. సమాచారహక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా నోట్ల రద్దుకు సంబంధించి పలు వివరాలు కోరింది. మొత్తం 14 ప్రశ్నలకు ఆర్బీఐ కేవలం ఐదు ప్రశ్నలకు జనవరి 11న సమాధానమిచ్చింది. మిగిలిన వాటికి చిత్రమైన సమాధానాలతో సరిపెట్టింది. నోట్ల రద్దు.. అనంతం ఎదురయ్యే పరిణామాలను సమర్థంగా ఎదుర్కొవడంపై ఆర్బీఐ ఎలాంటి కసరత్తు చేసిందన్న ప్రశ్నలపై ఆర్బీఐ స్పందన హాస్యాస్పదంగా ఉంది. 
 
ఇలాంటి వివరాలను వెల్లడిస్తే దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని పేర్కొంది. నోట్ల రద్దు అంశంపై 2016 నవంబరు 8కి ముందు ఆర్బీఐ బోర్డులో చర్చించలేదని స్పష్టం చేసింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో ఎంత విలువైన నగదు జమ అయిందన్న వివరాలు తమ వద్ద లేవని పేర్కొంది.