శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2015 (15:49 IST)

వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచిన ఆర్బీఐ : బ్యాంకుల తీరు మారలేదు

భారత రిజర్వు బ్యాంకు మంగళవారం మధ్యంతర ద్రవ్యపరపతిపై సమీక్ష నిర్వహించింది. ఇందులోభాగంగా కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచగా, నగదు నిల్వల నిష్పత్తి 4 శాతంలో కూడా ఎలాంటి మార్పులు చేయలేదని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వెల్లడించారు. 
 
ముఖ్యంగా రెపోరేటు 7.25, రివర్స్ రెపోరేటును యధాతథంగా ఉంచినట్టు తెలిపారు. ఆర్థిక స్థిరత్వం, పురోగతి ప్రక్రియ కొనసాగుతోందని, అయితే ద్రవ్యోల్బణం మాత్రం తమకు ఆందోళన కలిగించే అంశమన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక ప్రగతి 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు రఘురాం రాజన్ చెప్పారు. 
 
ఇకపోతే ఈ యేడాది జనవరి నుంచి ఇప్పటివరకు వడ్డీ రేట్లను 0.75 శాతం తగ్గించగా, బ్యాంకులు మాత్రం తమ ఖాతాదారులకు కేవలం 0.3 శాతం మాత్రమే తగ్గించాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ చర్య ప్రభుత్వం బ్యాంకులకు ఇచ్చే అదనపు మూలధనం వృద్ధికి దోహదం చేస్తుందన్నారు.