శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (12:30 IST)

రూపాయి.. బేజారు... రెండేళ్ల కనిష్టానికి మారకపు విలువ!

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. గురువారం ఫారిన్ ఎక్స్ఛేంజ్ సెషన్లో రూపాయి విలువ రెండేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఫలితంగా డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.88కి చేరింది. దిగుమతిదారుల నుంచి అమెరికన్ కరెన్సీ కోసం వచ్చిన డిమాండ్ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో భారత రిజర్వు బ్యాంకు జోక్యం చేసుకుని డాలర్ల విక్రయానికి నడుం బిగించకుంటే, సమీప భవిష్యత్తులో డాలర్‌తో రూపాయి మారకపు విలువ రూ.68ని తాకవచ్చని చెపుతున్నారు. కాగా, గురువారం నాటి ఆర్బీఐ రిఫరెన్స్ రేట్ల ప్రకారం, రూపాయి మారకపు విలువ యూరోతో రూ.70.69, జపాన్ యన్‌తో రూ.54.30, పౌండ్ స్టెర్లింగ్‌తో రూ.100.64గా ఉంది.