మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (17:13 IST)

ఇన్వెస్టర్లకు ఊరట నిచ్చిన మార్కెట్.. లాభాలతో ముగిసిన సెన్సెక్స్ సూచీ

వారాంతంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గురువారం వరకు భారీ నష్టాలతో బెంబేలెత్తించిన స్టాక్‌ మార్కెట్ శుక్రవారం కాస్తకోలుకున్నాయి. సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. గురువారం సెన్సెక్స్‌ దాదాపు 800 పాయింట్ల భారీ నష్టాలు చవి చూసిన సంగతి తెలిసిందే. 
 
అయితే, శుక్రవారం సెన్సెక్స్‌ 34.29 పాయింట్లు లాభపడి 22986.12 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్వల్పంగా 4.60 పాయింట్లు లాభపడి 6980.95 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 68.18 వద్ద కొనసాగుతోంది. 
 
బీఎస్ఈలో మిడ్‌క్యాప్ 0.78 శాతం, స్మాల్‌క్యాప్ 1.21 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 23 కంపెనీలు లాభాల్లో నడిచాయి. ఐడియా, టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, కెయిర్న్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు లాభపడగా, బీహెచ్ఈఎల్, బీపీసీఎల్, పీఎన్బీ, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి.