బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2015 (12:24 IST)

అమీర్ ఖాన్ వ్యాఖ్యలు: స్నాప్ డీల్‌కు లాభమే.. ర్యాంకు మెరుగు..!

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్నాప్ డీల్ సంస్థ ప్రకటించింది. దీంతో స్నాప్ డీల్‌కు నష్టం వాటిల్లినట్లు అందరూ భావించారు. కానీ వాస్తవానికి అమీర్ వ్యాఖ్యలతో స్నాప్ డీల్‌కు భారీగా దెబ్బ పడినట్లుగా వస్తున్నట్లు పలువురు అంచనాలకు భిన్నంగా పరిస్థితి మారిపోయింది. అమీర్ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చిన రోజున స్నాప్ డీల్ ర్యాంకు పడిపోయినప్పటికీ, నాలుగు రోజుల వ్యవధిలో పడిన ర్యాంకు నుంచి మెరుగైన ర్యాంకు వచ్చినట్లు తెలుస్తోంది.
 
అమీర్ వ్యాఖ్యల కారణంగా స్నాప్ డీల్ ర్యాంకు 27కు పడిపోతే.. నాలుగు రోజుల వ్యవధిలో ఈ ర్యాంకు కాస్త 22కు చేరుకోవటం గమనార్హం. తొలుత అమీర్‌కు వ్యతిరేకంగా జరిగితే.. ఆపై అమీర్ వివరణ.. అమీర్ అభిమానులు పోటీ కార్యక్రమం షురూ చేయటంతో పాటు.. స్నాప్ డీల్ యాజమాన్యం ఇచ్చిన ‘దేశీ బ్రాండ్’ అన్న మాట కూడా లాభాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
మొత్తంగా అమీర్ కారణంగా ఒకట్రెండు రోజులు స్నాప్ డీల్ ఒడిదుడుకులకు లోనైనా.. సర్దుకొని బిజినెస్ దూసుకుపోవటం గమనార్హం. అసహనం ఇష్యూతో 85వేల మంది మాస్.. స్నాప్ డీల్ యాప్‌ను డౌన్ లౌడ్, ఇన్‌స్టాల్‌కు ప్రయత్నించడంతో ర్యాంకు మెరుగైందని సంస్థ వెల్లడించింది.