శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 6 ఆగస్టు 2016 (16:25 IST)

భారతీయ రోడ్లపైకి రోల్స్-రాయిస్ 'డాన్'.. ధర రూ.6.25 కోట్లు!

అంతర్జాతీయ కార్ల ఉత్పత్తి కంపెనీ రోల్స్-రాయిస్ తన సరికొత్త లగ్జరీ కారు డాన్‌ను దక్షిణ భారత రోడ్లపైకి పరుగుపెట్టించనుంది. ఇందుకోసం తొలిసారి ఈ కారును దక్షిణాదిలో ప్రవేశపెడుతున్నారు.

అంతర్జాతీయ కార్ల ఉత్పత్తి కంపెనీ రోల్స్-రాయిస్ తన సరికొత్త లగ్జరీ కారు డాన్‌ను దక్షిణ భారత రోడ్లపైకి పరుగుపెట్టించనుంది. ఇందుకోసం తొలిసారి ఈ కారును దక్షిణాదిలో ప్రవేశపెడుతున్నారు. దక్షిణ భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగం, లగ్జరీ వస్తువుల పట్ల పెరుగుతున్నమోజు, నానాటికీ పెరుగుతున్న యువ పారిశ్రామికవేత్తలు, భారత భవిష్యత్ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ కారును మార్కెట్‌లోకి విడుదల చేసింది.
 
దీనిపై ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ పాల్ హారిస్ మాట్లాడుతూ, రోల్స్-రాయిస్‌కి దక్షిణ భారతదేశం తమకు అత్యంత కీలకమైన ప్రాంతమన్నారు. ఇది దేశపు ఆర్థిక ప్రగతికి ఇరుసుగానూ, సూపర్ లగ్జరీ వస్తువులకి గొప్ప మార్కెట్‌గా కూడా ఉందన్నారు. అందుకే డాన్ యాత్ర ఈ ప్రాంతంలోని చెన్నై, హైదరాబాద్, కొచ్చి నగరాల నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. 
 
అలాగే, కున్ మోటొరెన్ డైరెక్టర్ వాసంతి భూపతి మాట్లాడుతూ, 'రోల్స్-రాయిస్ మోటారు కార్లకి అధీకృత డీలర్‌గా 2011లో మేం నియమితులైనప్పటి నుంచి ఈ స్వరూపమైన కార్ల పోర్టుఫోలియోలో మా ఖాతాదారులకి మరింత ఐచ్ఛికావకాశాలని కల్పించడం ద్వారా వ్యాపారం అభివృద్ధిచెందడం గమనించేం. ఘోస్ట్, రాయిత్‌ల విజయం డాన్‌కి మార్గం వేసింది, మళ్లీ ఇది దక్షిణ భారతదేశంలో సమున్నతమైన లగ్జరీ కారు అవుతుందని భావిస్తున్నట్టు విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
రోల్స్-రాయిస్ తాలూకు డిజైన్ పద్ధతి ఈ కేబిన్‌ని తలపించేలా ఉంటుంది. అది ఈ బ్రాండ్ తాలూకు ఎదురులేని పనితనం, నిశ్ఛేష్టమైన తాత్వికతలని ప్రతిబింభిస్తూనే శక్తివర్థకమైన డ్రైవింగ్ అనుభవాన్ని సాధించేదిగా ఉంటుంది. డాన్ అత్యంత సమకాలీనం, నాలుగు సీట్ల-లగ్జరీ డ్రాప్ హెడ్‌తో రోల్స్ రాయిస్ డిజైన్ భాషలో ఇది పరిణామాత్మకం, దీనివెనుక ఒక స్పష్టమైన లక్ష్యం వుంది: దీని పైకప్పు మూసినా, తెరిచి వున్నా కూడా ఈ కారు అత్యంత సుందరంగా కనిపిస్తుందని తెలిపారు. ఈ కారు ధరను రూ.6.25 కోట్లుగా నిర్ణయించినట్టు తెలిపారు.