Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చలామణిలో ఉన్న నోట్లు 15.4 లక్షల కోట్లు.. ఎంతొచ్చిందో ఇంకా లెక్కబెట్టలేకపోతున్న ఆర్బీఐ

హైదరాబాద్, గురువారం, 13 జులై 2017 (06:02 IST)

Widgets Magazine
new currency note bundle

వ్యవస్థను ధ్వంసం చేయడం చాలా సులభం. కానీ కొత్తదాన్ని నిర్మించడం చాలా కష్టం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఈ విషయం రిజర్వ్ బ్యాంకుకు చాలా ఆలస్యంగా బోధపడినట్లుంది. గత అక్టోబర్‌లో రద్దు చేసిన పెద్ద నోట్లలో ఎన్ని బ్యాంకుల్లో జమ అయ్యాయి అన్నది లెక్కించడానకి తొమ్మిది నెలల సమయం కూడా సరిపోలేదు. పైగా లెక్కింపు ఎప్పటికి పూర్తవుతుందో కూడా ఆర్బీఐకి తెలీదట. స్వయంగా గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెబుతున్న మాటల బట్టి చూస్తే సమీప భవిష్యత్తులో కూడా రద్దయిన పెద్దనోట్లు ఎన్ని బ్యాంకుల్లో జమ అయిందీ తెలీకపోవచ్చని అర్థమవుతోంది. దీంతో విసిగిపోయిన పార్లమెంటరీ కమిటీ ఈ అంశంపై ఉర్జిత్‌ను మళ్లీ కమిటీ ముందుకు పిలవబోమని తేల్చి చెప్పేసింది.
 
రద్దయిన రూ. 500, రూ. 1,000 నోట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ వెల్లడించారు. రద్దు తర్వాత ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన ఆ నోట్లను ఇంకా లెక్కిస్తున్నామని, అందువల్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి ఎంత డబ్బు వచ్చిందో కచ్చితంగా చెప్పలేనని పేర్కొన్నారు. ‘ఆర్బీఐ ప్రత్యేక బృందం రోజుకు 24 గంటలూ ఆ నోట్లను లెక్కిస్తోంది. వారికి శనివారంతోపాటు చాలా సెలవులను తగ్గించాం. ఆదివారం మాత్రమే సెలవు లభిస్తోంది’ అని ఆయన బుధవారం ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి చెప్పినట్లు తెలుస్తోంది. 
 
ఆర్బీఐకి ప్రస్తుతం 15,000 మంది సిబ్బంది ఉన్నారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రద్దయిన నోట్లను లెక్కించడానికి కొత్త కౌంటింగ్‌ యంత్రాల కోసం టెండర్లు జారీచేసినట్లు ఉర్జిత్‌ పార్లమెంటరీ కమిటీకి చెప్పారు. ఆయన ఈ కమిటీ ముందు హాజరు కావడం ఇది రెండోసారి. మూడు గంటలు కొనసాగిన ఈ సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌.ఎస్‌. ముంద్రా కూడా పాల్గొన్నారు. 
 
రద్దయిన నోట్లలో ఎంత మొత్తం తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందని ఉర్జిత్‌ను నరేశ్‌ అగర్వాల్‌(సమాజ్‌వాదీ), సౌగతా రాయ్‌(తృణమూల్‌ కాంగ్రెస్‌) ప్రశ్నించారు. రద్దు కాకముందు దేశంలో మొత్తం రూ. 17.7 లక్షల కోట్ల డబ్బు చలా మణిలో ఉండేదని, ప్రస్తుతం రూ. 15.4 లక్షల కోట్లు ఉందని ఉర్జిత్‌ తెలిపారు. రద్దు తర్వాత తిరిగి చలామణిలోకి వచ్చిన డబ్బు పై ఆర్బీఐ చీఫ్‌ కచ్చితమైన సమాధానం చెప్పకపోవడంతో కమిటీలోని పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఉర్జిత్‌ను మళ్లీ కమిటీ ముందుకు పిలవబోమని స్పష్టం చేశారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

కస్టమర్‌కు పంపినా, ప్రియురాలికి పంపినా ఇక బాదుడే బాదుడు..రండి చెబుతాం

నాదగ్గరికి వస్తే చాలు.. బాదిపడేస్తాను జాగ్రత్త అంటూ చెప్పి మరీ బాదుతోంది భారతీయ స్టేట్ ...

news

జీఎస్టీ: 66 వస్తువులపై పన్ను రేట్లు తగ్గింపు.. రూ.100 కంటే తక్కువ ఉన్న సినిమా టిక్కెట్లపై?

వస్తు, సేవలపన్ను (జీఎస్టీ) పదహారవ సమావేశం వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 66 ...

news

మీకు నడపటం చేతకాక మాంసాహారం బంద్ చేస్తారా మహరాజా

ఉరుము ఉరిమి మంగలం మీద పడిందంటే ఇదేమరి. ఎయిరిండియా మహారాజావారికి మహా కోపం వచ్చేసింది. ...

news

ఆలస్యంగా రావడంలో ఆ రైలు ఫస్ట్...

దేశంలో నడిచే రైళ్లు సమయానికి రావు అనే అపవాదు ఉంది. దీన్ని మరింతగా రుజువు చేసేలా ఓ ట్రైన్ ...

Widgets Magazine