శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 16 నవంబరు 2015 (13:37 IST)

ప్రజలపై స్వచ్ఛ భారత్ పన్ను... పెరిగిన పెట్రోల్ ధరలు

కేంద్ర ప్రభుత్వం ప్రజలపై స్వచ్ఛ భారత్ పన్ను భారం మోపింది. దీంతో ఇప్పటివరకు 14 శాతం వసూలు చేస్తున్న సేవా పన్నును ఇకపై స్వచ్ఛ భారత్ సెస్‌తో కలిపి 14.5 శాతంగా వసూలు చేయనున్నారు. దీంతో అన్ని రకాల వస్తు ధరలు పెరుగనున్నాయి. 
 
మరోవైపు ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఈ పెరుగుదల లీటర్ పెట్రోలుకు 36 పైసలు, డీజిల్‌కు 87 పైసలు చొప్పున ఉంది. నిజానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు బ్యారెల్ ధర 44 డాలర్లే ఉన్నప్పటికీ ఆయిల్ కంపెనీలు మాత్రం పెట్రో ధరల పెంచేశాయి. 
 
ఈ పెంపునకు ఓ కారణాన్ని కూడా చెపుతోంది. అంతర్జాతీయంగా డాలర్‌తో రూపాయి మారకపు విలువ పడిపోతున్నందునే ధరలు పెంచాల్సి వచ్చిందంటూ ఐఓసీ సెలవిచ్చింది. 
 
ఇప్పటికే నిత్యావసర వస్తువల ధరలు మండిపోతున్నాయి. పప్పులు, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. పెట్రోలు ధరలు పెంచడంతో పాటు... అన్ని రకాల సర్వీసుల మీద.. స్వచ్ఛ భారత్ సేవా పన్నును వసూలు చేయాలని కేంద్రం భావించడంతో ఈ ధరలు మరింతగా పెగనున్నాయి.