గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (12:44 IST)

క్యాష్ చెల్లించి బంగారం కొంటున్నారా? అయితే, పన్ను చెల్లించాల్సిందే

బంగారు నగల కొనుగోలుదారులపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపనుంది. క్యాష్ (నగదు) చెల్లించి బంగారం కొనుగోలు చేసే వారి నుంచి విధిగా పన్ను రాబట్టుకోనుంది. ఇందుకోసం ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)‌ను

బంగారు నగల కొనుగోలుదారులపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపనుంది. క్యాష్ (నగదు) చెల్లించి బంగారం కొనుగోలు చేసే వారి నుంచి విధిగా పన్ను రాబట్టుకోనుంది. ఇందుకోసం ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)‌ను తెరపైకి తెచ్చింది. 
 
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఈ తరహా చర్య చేపట్టింది. ఇక నుంచి రూ.2 లక్షలకు మించి బంగారాన్ని నగదుతో కొనుగోలు చేసేవారు అక్కడికక్కడే ఒక శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 
 
కొత్త ఆర్థిక సంవత్సరం (2017-18) ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. నిజానికి రూ.5 లక్షల వరకు బంగారాన్ని నగదు ఇచ్చి కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతకుమించి కొనుగోలు చేస్తేనే టీసీఎస్ చెల్లించాలి. 
 
అయితే బడ్జెట్‌లో బంగారాన్ని సాధారణ వస్తువుల జాబితాలోకి ప్రభుత్వం చేర్చింది. దీంతో ఇక నుంచి రూ.2 లక్షలకు మించి బంగారాన్ని నగదుతో కొనుగోలు చేస్తే టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై నగదుతో బంగారు కొనుగోలు చేసేముందు వెనుకాముందు ఆలోచించాల్సి ఉంటుంది.