శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (11:53 IST)

పార్లమెంట్ సభ్యులకూ వంటగ్యాస్ రాయితీ నిలిపివేత!

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా అత్యున్నత ఆదాయ వర్గాలకు వంటగ్యాస్ రాయితీని నిలిపి వేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. పార్లమెంట్ సభ్యులు కూడా రాయితీ వదులుకోవాలన్నారు. 
 
అలాగే మేక్ ఇన్ ఇండియాతో ఉద్యోగార్థులను ఉపాధి కల్పించేవారుగా మారుస్తామన్నారు. ఎస్‌బీఎఫ్‌సీల కోసం సర్ఫెసీ పథకాన్ని, రూ.500 కోట్ల పెట్టుబడితో వున్న ఎస్‌బీఎఫీలు ఈ పథకంలోకి వస్తాయి. మైక్రో ఫైనాన్స్ కంపెనీలు కూడా దీని పరిధిలోకి వస్తాయని మంత్రి వెల్లడించారు