గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 నవంబరు 2016 (10:25 IST)

డబ్బు లేకుంటే ఏం... డెబిట్ కార్డు కార్డుల ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు : ఉర్జిత్ పటేల్

దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత కంటికి కనిపించకుండా పోయిన భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐతో ఆయన మనసు విప్పి మాట్లాడారు.

దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత కంటికి కనిపించకుండా పోయిన భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐతో ఆయన మనసు విప్పి మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో జనం ఎదుర్కొంటున్న వాస్తవ ఇబ్బందులపై రోజువారీ సమీక్ష జరుపుతూ వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిజాయితీపరుల సమస్యల పరిష్కారానికి, వారికి తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.
 
బ్యాంకుల్లో నగదు లభ్యత రోజురోజుకు పెరుగుతోందని, పరిస్థితులు యథాపూర్వ పరిస్థితికి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ పూర్తిస్థాయిలో దృష్టి సారించిదన్నారు. నగదు సమస్యను పరిష్కరించేందుకు బ్యాంకులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయన్నారు. బ్యాంకులు, ఏటీఎంల్లో నగదు అందుబాటులో ఉందని, డిమాండ్‌కు అనుగుణంగా నోట్ల ముద్రణ కూడా జరుగుతోందన్నారు. 
 
ముఖ్యంగా.. చేతిలో నగదు లేకపోయినప్పటికీ.. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త నోట్లు అందుబాటులో ఉంచేలా ప్రింట్రింగ్ ప్రెస్‌లు పూర్తి స్థామర్థ్యంతో పనిచేసేందుకు ఆర్బీఐ, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. నకిలీ నోట్ల అక్రమతయారీకి వీల్లేని విధంగా కొత్త కరెన్సీని డిజైన్ చేశామని, అందువల్లే నోటు మందం, సైజుల్లో తేడాలు ఉన్నట్టు తెలిపారు. కాగా, ఈనెల 8వ తేదీన కొత్త నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆర్బీఐ గవర్నర్ స్పందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.