శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ivr
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2017 (18:19 IST)

'ఏరో ఇండియా 2017'... రక్షణ రంగంలో అమెరికా-ఇండియా కలిసి...(ఫోటోలు)

ఏరో ఇండియా 2017 షో ఈసారి ఐటీ నగరం అయిన బెంగళూరు యలహంక ఎయిర్ స్టేషనులో జరుగుతోంది. ఈ సందర్భంగా అమెరికా ప్రతినిధి మేరీ ఇరు దేశాల రక్షణ రంగంలో భాగస్వామ్యం గురించి మాట్లాడారు. ఏరో ఇండియా 2017 షోలో పాల్గొన

ఏరో ఇండియా 2017 షో ఈసారి ఐటీ నగరం అయిన బెంగళూరు యలహంక ఎయిర్ స్టేషనులో జరుగుతోంది. ఈ సందర్భంగా అమెరికా ప్రతినిధి మేరీ ఇరు దేశాల రక్షణ రంగంలో భాగస్వామ్యం గురించి మాట్లాడారు. ఏరో ఇండియా 2017 షోలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు. రక్షణ రంగంలో ఇండో-అమెరికా భాగస్వామ్యం గురించి ఆమె చెపుతూ... డిఫెన్స్ రంగంలో రెండు దేశాల సంబంధాలు పరస్పరం ముందంజలో వుంటాయన్నారు. ఈ రంగంలో ఇరు దేశాల వర్తకం సుమారు 15 బిలియన్ డాలర్లుగా ఉందని వెల్లడించారు.
 
2017 నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్, డిఫెన్స్ టెక్నాలజీలో అభివృద్ధి, వర్తకం అంశాల్లో అమెరికాకు భారతదేశం ప్రధానమైన డిఫెన్స్ భాగస్వామిగా ఉందని అన్నారు. మున్ముందు ఈ సహకారం మరింత పెరుగుతుందని చెప్పారు. భారతదేశానికి ఈ స్థాయి రావడం వెనుక ఎంతటి కృషి వుండి వుంటుందో తమకు తెలుసునని అన్నారు. సరకు మరియు టెక్నాలజీ ఎగుమతుల విషయంలో భారతదేశం కష్టించి పనిచేస్తుందని కొనియాడారు. అందువల్లనే నేడీ స్థాయికి చేరుకున్నారని అన్నారు.
 
భారతదేశంతో తమ సంబంధాలు, కలిసి పనిచేయడం వల్ల తమ దేశంలోని ప్రజలతో పాటు ప్రపంచానికి కూడా మేలు జరుగుతుందన్నారు. భవిష్యత్తులో అమెరికా అత్యున్నతమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన సాధనాలను అందించడానికి కృషి చేస్తూనే వుంటుందన్నారు. ఈ ఏడాది 20కి పైగా అమెరికా కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ఈ కంపెనీల్లో కొన్ని ఎన్నో ఏళ్లుగా భారతదేశంలోనే పనిచేస్తుండగా మరికొన్ని కొత్తగా పరిచయమైనవని చెప్పారు. ప్రస్తుత ప్రదర్శనలో పాల్గొంటున్న అన్ని కంపెనీల ఎగ్జిబిటర్లు ఇండియా డిఫెన్స్ రంగానికి అవసరమైన మరిన్ని సాధనాలను అందిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఇండో-అమెరికా కంపెనీలు ఉత్పత్తి మరియు ఆధునిక రక్షణ, ఏవియేషన్ టెక్నాలజీలో కలిసి పనిచేసేందుకు ఒప్పందాలను కుదుర్చుకుంటూ వుండటం తనకు గర్వంగా ఉందన్నారు. ఈ భాగస్వామ్యం వల్ల అటు అమెరికా ఇటు ఇండియాలో వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఏరో ఇండియా 2017 ప్రదర్శనలో పాల్గొంటున్నందుకు తనకు ఎంతో సంతోషంగా వుందనీ, ఇలాంటి ప్రదర్శనలు మరెన్నో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.