గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 మే 2016 (12:30 IST)

నన్ను అరెస్టు చేయనని మాట ఇవ్వండి... అప్పుడు భారత్‌లో అడుగు పెడతా... మాల్యా

బ్యాంకులకు బకాయిల విషయంలో తానిచ్చిన మాటకు కట్టుబడి ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పేర్కొన్నారు. గత రెండు నెలలుగా మాల్యాను లండన్‌ నుంచి భారత్ రప్పించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పట్టుదలతో ఉంది. అయితే యూబీఎల్ చైర్మన్ మాల్యాకు బోర్టు, వ్యూహాత్మక భాగస్వామి హైనెకెన్ మద్దతు కొనసాగుతోంది. 
 
యునైచెడ్ బ్రెవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) బోర్డు మీటింగ్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్ నుంచి మాట్లాడిన మాల్యా.. భారత్‌కు తిరిగొచ్చేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని.. అయితే తగిన భద్రత, స్వేచ్ఛ కల్పిస్తే దేశానికి వచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపారు. 
 
భద్రత, స్వేచ్ఛ కల్పిస్తే భారత్‌కు వచ్చేందుకు మాల్యా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారని ఇండిపెండెంట్ బోర్డ్ మెంబర్ కిరణ్ మజుందార్-షా వెల్లడించారు. బ్యాంకుల కన్సార్టియం మెయిన్ లీడర్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బకాయిల చెల్లింపు విషయమై తాను కొత్త ప్రతిపాదన చేశానని, దీనిపై సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బకాయిలు సాధ్యమైనంత త్వరలో చెల్లించేందుకు కూడా మాల్యా సుముఖత వ్యక్తం చేసినట్లు కిరణ్ మంజుదార్ షా తెలిపారు.