శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (05:17 IST)

వీసాలపై ఆధారపడి పరిశ్రమను నిర్మించలేం. అవకాశాలను వెతుక్కోవలసిందే అంటున్న ఎన్ఆర్ మూర్తి

స్థానికులకు అవకాశాలు తగ్గిపోతున్నప్పుడు ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా నిబంధనలు విదించక తప్పదని, ఈ రోజు అమెరికా చేస్తున్నది రేపు ఇండియానే కాదు.. మరే దేశమైనా చేయవచ్చని ఇన్ఫోసిస్ కంపెనీ సహ వ్యవస్థాపకులు ఎన్ ఆర్ నారాయణ మూర్తి చెప్పారు. అదేసమయంలో వీసాలపై ఆధారప

స్థానికులకు అవకాశాలు తగ్గిపోతున్నప్పుడు ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా నిబంధనలు విదించక తప్పదని, ఈ రోజు అమెరికా చేస్తున్నది రేపు ఇండియానే కాదు.. మరే దేశమైనా చేయవచ్చని ఇన్ఫోసిస్ కంపెనీ సహ వ్యవస్థాపకులు ఎన్ ఆర్ నారాయణ మూర్తి చెప్పారు. అదేసమయంలో వీసాలపై ఆధారపడి ఏ పరిశ్రమనూ నిర్మించలేమని, హెచ్1- బి వీసాను కుదించడం, తొలగించడం వంటి పరిస్థితులు ఎదురైతే నూతన అవకాశాలను వెదుక్కోవడమే మార్గమని సూచించారు.
 
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం భారతీయ ఐటీ నిపుణులకు దశాబ్దంపైగా ఇస్తున్న హెచ్1-బి వీసాలపై కోతపెట్టే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వీసాలతో పనిలేకుండా స్వతంత్రంగా పనిచేసే గ్లోబల్ డెలివరీ మోడల్‌ను వృద్ధి చేసుకోవడం ద్వారా  మనం చేసే మొత్తం ఉత్పాదక ప్రయత్నాన్ని 200 శాతం మేరకు కుదించుకోవచ్చని నారాయణ మూర్తి చెప్పారు. 
 
మరోమాటలో చెప్పాలంటే  మొత్తం ఉత్పత్తి కోసం చేస్తున్న ప్రయత్నంలో 30 శాతాన్ని పది శాతానికి తగ్గించుకోవచ్చని, దీనివల్ల ఐటీ కంపెనీల మొత్తం ఆదాయం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని మూర్తి తెలిపారు. స్థానికంగా ఉండే ప్రతిభను గుర్తించి వారిని ఉద్యోగాల్లో నియమించుకుంటే తక్కువ ప్రయత్నంతోనే కంపెనీలు అపార లాభాలు సాధించే అవకాశముందన్నారు. 
 
స్థానికులను నియమించుకుంటే విదేశాల్లోని వారి కార్పొరేషన్లకు మార్కెట్లో మన సేవలను వారే మరింత ఉత్తమంగా అమ్మిపెట్టి లాభాలు అందించగలరని నారాయణ మూర్తి విశ్లేషించారు. అమెరికా వంటి దేశాల్లో భారతీయ సంస్థలు స్థానికులనే ఉద్యోగాల్లో నియమించుకుంటే వారు మన కస్టమర్లతో అంటే అమెరికన్ కస్టమర్లతో మరింత బాగా కలిసిపోయి సంప్రదించగలరని ఇందుకు కారణం ఇంగ్లీషును మాతృభాషగా వారు మాట్లాటగలగటమేనని మూర్తి చెప్పారు. 
 
కస్టమర్ల భాషా సంప్రదాయాలను, వారి స్థానిక పదాలను స్థానిక ఉద్యోగులు మరింత బాగా అర్థం చేసుకోగలరని చెప్పారు. ఇప్పుడంటే ట్రంప్ ఆంక్షలతో మన ఐటీ పరిశ్రమకు పర్వత భారం ఏదో మోస్తున్నట్లు అనిపస్తోందని, కాని ట్రంప్ సవరణవల్ల అమెరికాలో భారతీయ పరిశ్రమ ఇంకా పెరిగేందుకు బోలెడు అవకాశాలు కలుగనున్నాయని మూర్తి భరోసా ఇచ్చారు.