మోదీ గారూ.. మీరైనా చెప్పొచ్చుగా.. బ్యాంకులు డబ్బులెందుకు తీసుకోవట్లేదు.. మాల్యా

Last Updated: గురువారం, 14 ఫిబ్రవరి 2019 (12:00 IST)
బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై బుధవారం లోక్‌సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై విజయ్ మాల్యా స్పందించారు. రూ.9వేల కోట్లతో ఓ వ్యక్తి విదేశాలకు చెక్కేశారని మోదీ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా స్పందించారు.. విజయ్ మాల్యా. 
 
పార్లమెంట్‌లో తనపై ప్రధాని ప్రసంగం అనర్గళంగా వుందన్నారు మాల్యా. తొమ్మిది వేల కోట్లతో ఓ వ్యక్తి విదేశాలకు వెళ్లాడనే మాట తన గురించే వచ్చిందనే విషయం తెలుసు. మోదీని ఎంతో గౌరవంగా ఓ విషయం అడుగుతున్నా. టేబుల్‌పై తాను వుంచిన డబ్బును తీసుకోవాలని బ్యాంకులకు ఎందుకు సూచించట్లేదు. కింగ్‌ ఫిషర్‌కు ఇచ్చిన అప్పులను రికవర్ చేసిన పూర్తి క్రెడిట్‌ను మోదీ తీసుకోవచ్చుకదా. 
 
హైకోర్టుకు సమస్య పరిష్కారం వెళ్లాను. తాను డబ్బులిస్తానని చెప్తే.. బ్యాంకులు ఎందుకు తీసుకోవట్లేదు.. అని విజయ్ మాల్యా ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. తాను డబ్బులిస్తానని ఆఫర్ ఇస్తుంటే.. దాన్ని పనికి మాలిన చర్యగా పక్కన పెట్టకూడదని, ఎంతో నిజాయతీతో తాను డబ్బులిచ్చేస్తానని చెప్తున్నానని విజయ్ మాల్యా వ్యాఖ్యానించారు.
 
అలాగే మరో ట్వీట్‌లో మాల్యా ట్వీట్ చేస్తూ.. తాను సంపదను దాచినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చెబుతోందని, నిజంగా అలాంటి రహస్య సంపదే ఉంటే రూ. 14వేల కోట్ల విలువైన ఆస్తులను కోర్టు ముందు ఎందుకు ఉంచుతానని మాల్యా అడిగారు. దీనిపై మరింత చదవండి :