శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 నవంబరు 2019 (14:03 IST)

బంగారానికి రసీదు అడిగిన అధికారి చెంప ఛెల్లుమంది.. ఎలా?

విదేశాల నుంచి భారత్‌కు అక్రమంగా బంగారం రవాణా అవుతోంది. విహార యాత్రల పేరిట విదేశాలకు వెళ్ళిన స్మగ్లర్లు.. విదేశాల్లో తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసి భారత్ లోకి తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళిన సమయంలో భారతీయులు భారీగా బంగారాన్ని స్మగ్లింగ్ చేయడంతో అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
ఇలా బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కొందరు మహిళలు బిల్లు అడిగితే అధికారుల మీద దాడి చేసారు. దుబాయ్ నుంచి స్పైస్‌జెట్ ఫ్లైట్‌లో అహ్మదాబాద్‌కు వచ్చిన కొందరు భార్యాభర్తలను తనిఖీ చేయగా వారి వద్ద పెద్ద మొత్తంలో బంగారం ఉంది. వాటికి సంబంధించిన బిల్లులు చూపించాలని మహిళలను అడగగా వారు ఏకంగా కస్టమ్స్ అధికారి చెంపఛెల్లుమనిపించారు. 
 
ఇక వెంటనే భర్తలతో కలిసి విమానాశ్రయంలో కుర్చీలు ఫర్నీచర్ నాశనం చేస్తూ గలాటాకు దిగారు. ఇక అక్కడికి మీడియా వెళ్లి చూడగా అధికారులు స్పందిస్తూ తాము బంగారానికి రశీదులు అడిగితే తమ మీద దాడికి దిగారని వాపోయారు. ప్రస్తుతం వారిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కి తరలించారు.