శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr

నేటి అర్థరాత్రి నుంచి పెట్రోల్‌ బంకుల్లో డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగం బంద్‌

దేశవ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల్లో సోమవారం అర్థరాత్రి నుంచి డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల లావాదేవీలు నిలిచిపోనున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలపై ఒకశాతం సేవా రుసుం విధించాలన్న నిర్ణయంపై నిరసనకు న

దేశవ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల్లో సోమవారం అర్థరాత్రి నుంచి డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల లావాదేవీలు నిలిచిపోనున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలపై ఒకశాతం సేవా రుసుం విధించాలన్న నిర్ణయంపై నిరసనకు నిరసనగా పెట్రోల్ బంక్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 9వ తేదీ నుంచి అంటే... అర్థరాత్రి నుంచి అమలు చేయనున్నట్లు ఇండియన్‌ పెట్రోలియం డీలర్స్‌ సంఘం సంయుక్త కార్యదర్శి అమరమ్‌ రాజీవ్‌ తెలిపారు. 
 
కార్డుల చెల్లింపులపై వసూలు చేయాల్సిన అదనపు ఛార్జీలను డీలర్ల నుంచి వసూలు చేయాలని నిర్ణయించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. డీజిల్‌పై 2.5 శాతం, పెట్రోల్‌పై 3.2 శాతం చొప్పున డీలర్లకు కమిషన్‌ వస్తుందని.. అందులో నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. 
 
తమ లావాదేవీల్లో 80 శాతం కార్డుల ద్వారానే జరుగుతున్నాయని, ఇలాంటప్పుడు అదనపు ఛార్జీలు డీలర్లు వద్ద వసూలు చేస్తామంటే ఎలాగని డీలర్లు నిలదీస్తున్నారు. పెట్రోల్ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించిన సేవారుసుం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.