బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2017 (14:11 IST)

చెన్నై ఎస్ఆర్ఎంలో జపాన్ ఎడ్యు ఫెయిర్.. ఉన్నత విద్యావకాశాలపై....

తమ దేశంలో ఉన్నత విద్యావకాశాలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జపాన్ దేశ విద్యాశాఖ ప్రతినిధులు చెపుతున్నారు. ముఖ్యంగా మెరుగైన విద్యార్థులకు వివిధ రకాల ఉపకారవేతనాలతో పాటు.. పలు రాయితీలు కల్పిస్తున్నట్టు వా

తమ దేశంలో ఉన్నత విద్యావకాశాలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జపాన్ దేశ విద్యాశాఖ ప్రతినిధులు చెపుతున్నారు. ముఖ్యంగా మెరుగైన విద్యార్థులకు వివిధ రకాల ఉపకారవేతనాలతో పాటు.. పలు రాయితీలు కల్పిస్తున్నట్టు వారు వివరించారు.
 
తాజాగా చెన్నైలోని ప్రముఖ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అగ్రగామిగా ఉన్న ఎస్ఆర్ఎం వర్శిటీలో ఉన్నత విద్యావకాశాలు, కల్పిస్తున్న సౌకర్యాలు, రాయితీలు, కోర్సుల వివరాలపై 'ఎడ్యుకేషన్ ఫెయిర్ 2017'ను జపాన్ ఉన్నత విద్యాశాఖ నిర్వహించింది. 
 
ఇందులో యూనివర్శిటీ ఆఫ్ టోక్యో, యోకోహమా విశ్వవిద్యాలయం, హాక్కోడా వర్శిటీ, వసీదా యూనివర్శిటీతో పాటు మొత్తం ఏడు వర్శిటీలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఎడ్యు ఫెయిర్‌ ప్రారంభంసందర్భంగా ఎస్ఆర్ఎం వర్శిటీ డైరెక్టర్ ఎస్.పొన్నుస్వామి మాట్లాడుతూ... తమ వర్శిటీకి దేశ వ్యాప్తంగా నాలుగు క్యాంపస్‌లు ఉన్నట్టు తెలిపారు. 
 
గత నెలలో ఏపీ నూతన రాజధాని అమరావతిలో కొత్త వర్శిటీని నెలకొల్పినట్టు తెలిపారు. ఇది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించినట్టు గుర్తుచేశారు. ఈ నాలుగు క్యాంపస్‌లలో కలుపుకుని సుమారు 55 వేల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు.
 
అనంతరం వర్శిటీ రిజిస్ట్రార్ ఎన్.సేతురామన్ మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఎస్ఆర్ఎంకు ప్రత్యేక గుర్తింపు, పేరు ఉందన్నారు. పైపెచ్చు, తమ వర్శిటీలో అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించేందుకు వివిధ దేశాలు, వర్శిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు తెలిపారు. 
 
ఇందులోభాగంగా, జపాన్‌కు చెందిన ఉన్నత విద్యాశాఖతోపాటు.. పలు విద్యాసంస్థలతో అవగాహనా ఒప్పందం ఉందని ఆయన తెలిపారు. ఈ కోవలోనే జపాన్ వర్శిటీలు ఎస్ఆర్ఎంలో జపాన్ ఎడ్యుఫెయిర్ 2017ను ప్రారంభించాయని తెలిపారు.