గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 జులై 2015 (16:58 IST)

తెల్లగౌన్లపై నిషేధం విధించాలి.. ఇన్ఫెక్షన్లు తప్పవ్!: వైద్య విద్యార్థి

భారతీయ వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సులు ధరించే తెల్లగౌన్లపై నిషేధం విధించాల్సిందేనని బెంగళూరుకు చెందిన వైద్య విద్యార్థి ఎడ్మండ్ ఫెర్నాండెజ్ డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా వైద్యులకు, వైద్య సిబ్బందికి ఆకట్టుకునే దుస్తులు, ముఖంపై చెరగని చిరునవ్వు ముఖ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే దుస్తులపై వైద్యుడి పేరు తెలిపేలా బ్యాడ్జ్ ధరించాలని ఆయన సూచించారు. 
 
ఇంకా తెల్ల డ్రెస్‌ల ద్వారా ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాప్తి చెందుతున్నాయని ఇప్పటికే ఓ సర్వే తేల్చిందనే విషయాన్ని ఫెర్నాండెజ్ గుర్తుచేశారు.19వ శతాబ్ధం నుంచి వైద్యులు, వైద్య విద్యార్థులు తెల్ల గౌనును సంప్రదాయంగా ధరిస్తున్నారని చెప్పిన ఫెర్నాండెజ్.. తెల్లగౌన్లు వ్యాధులను విస్తరింపజేసే వాహకాలుగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ట

దీంతో యాప్రాన్ల నిషేధంపై భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2007లో తెల్ల గౌను నిషేధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుందని, దీనిని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదించిందని ఫెర్నాండెజ్ పేర్కొన్నారు.