Widgets Magazine

రిజర్వు బ్యాంకులో ఆఫీస్ అటెండర్ పోస్టులు

భారతీయ రిజర్వు బ్యాంకులో ఆఫీస్ అటెండర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లోని ఆఫీస్ అటెండ్ పోస్టులను భర్తీ చేయబోతున్నార

job
pnr| Last Updated: బుధవారం, 22 నవంబరు 2017 (13:22 IST)
భారతీయ రిజర్వు బ్యాంకులో ఆఫీస్ అటెండర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లోని ఆఫీస్ అటెండ్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. నెల వేతనం సుమారు రూ.25,000కు నిర్ణయించారు. వీటితో పాటు.. ఇతర ప్రభుత్వ సదుపాయాలు ఉంటాయి.

మొత్తం 526 పోస్టులు ఉండగా, వీటిలో హైదరాబాద్‌-27, బెంగళూరు-58, చెన్నై-10, న్యూఢిల్లీ-27, ముంబై-165, భోపాల్‌-45, తిరువనంతపురం-47, అహ్మదాబాద్‌-39, చండీగఢ్, సిమ్లా-47, గౌహతి-10, జమ్మూకాశ్మీర్-19, లక్నో-13, కోల్‌కతా-10, నాగ్‌పూర్‌-09 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

ఇకపోతే, ఈపోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి వయసు 2017 నవంబర్ ఒకటో తేదీ నాటికి 25 యేళ్ళు నిండివుండాలి. పదో తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు అర్హులు.

దరఖాస్తును కేవలం ఆన్‌లైన్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం- నవంబరు 17, చివరితేది-డిసెంబరు 07. ఆన్‌లైన్ పరీక్ష తేది - డిసెంబరు లేదా జనవరిలో నిర్వహించనున్నారు.


దీనిపై మరింత చదవండి :