చంద్రుని శుభదృష్టి వల్ల మానసిక సంబంధమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే చంద్రుడు వక్రదృష్టితో వీక్షించడం వల్ల మనస్సు బాగుండదు. మూగతనం కూడా సంక్రమించే అవకాశం ఉంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. చివరికి మతిస్థిమితం కోల్పోవడం కూడా కద్దు. గుణాఢ్యుడి బృహత్కథ ఇందుకు ఉదాహరణ అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.