శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 1 మార్చి 2017 (08:14 IST)

అమ్మకున్న వెంటిలేటర్ ఎవరి అనుమతితో తొలగించారు? పన్నీర్ వర్గం ప్రశ్న

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి ఆద్యంతం అనుమానాస్పదమేనని వాటి నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాలని అన్నాడీఎంకే (పన్నీర్‌ సెల్వం వర్గం) ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. జయ ఆస్పత్రిలో చేరకముందు, ఆస్పత్రిల

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి ఆద్యంతం అనుమానాస్పదమేనని వాటి నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాలని అన్నాడీఎంకే (పన్నీర్‌ సెల్వం వర్గం) ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. జయ ఆస్పత్రిలో చేరకముందు, ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమెకు అందించిన చికిత్సల వివరాలను బహిర్గతం చేయాలని ఎంపీలు కోరారు. రాజ్యసభ సభ్యుడు మైత్రేయన నేతృత్వంలో మంగళవారం అరగంట పాటు ప్రణబ్‌తో భేటీ అయిన 12 మంది ఎంపీలు.. జయ మృతిపై తమకున్న అనుమానాలను ఆయనకు వివరించారు. అనంతరం మైత్రేయన్ మీడియాతో మాట్లాడారు.
 
గత సెప్టెంబరు 22 రాత్రి అపోలో ఆస్పత్రిలో జయ చేరినప్పటి నుంచి ఆమె మృతి చెందిన డిసెంబర్‌ 5 వరకు సందర్శకులెవ్వరినీ అనుమతించలేదని, శశికళే వారిని అడ్డుకున్నారని ఆరోపించారు. జయను ఆస్పత్రిలో చేర్చటానికి ముందు పోయెస్‌గార్డెనలో జరిగిన సంఘటనలు ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జయను చూడటానికి ఆమె విశ్వాస పాత్రుడిగా ఉన్న పన్నీర్‌సెల్వంను కూడా అనుమతించలేదన్నారు. 
 
డిసెంబర్‌ 4న ఉన్నట్టుండి ఆమెకు గుండెపోటు వచ్చిందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయని చెప్పారు. ప్రాణం విడిచే క్షణంలో ఆమెకున్న వెంటిలేటర్‌ను ఎవరి అనుమతితో తొలగించారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయను చూశానంటూ రాష్ట్రమంత్రి సెంగోట్టయ్యన్ చెబుతున్నదంతా కట్టుకథేనన్నారు. 
 
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకునే తాము జయ మృతిపై ఉన్నతస్థాయి సంస్థ ద్వారానో, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతనో విచారణ సంఘం ఏర్పాటు చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశామని మైత్రేయన పేర్కొన్నారు.
 
రాజ్యసభ సభ్యుడు మైత్రేయన నేతృత్వంలోని 12 మంది ఎంపీల బృందం మంగళవారం రాష్ట్రపతిభవనకు వెళ్లి ప్రణబ్‌ముఖర్జీని కలుసుకుని వినతి పత్రం అందించింది. అదేవిధంగా అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేకుండా ముఖ్య మంత్రి పళనిస్వామి విశ్వాసపరీక్ష నెగ్గినట్లు ప్రకటించుకున్నారని, అందు వల్ల ఆ బలపరీక్షను రద్దుచేసి రహస్య ఓటింగ్‌కు ఆదేశించాలని అభ్యర్థిం చారు.