శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2016 (12:53 IST)

చెన్నై వాసులకు షాకింగ్ న్యూస్.. ఫుట్‌పాత్ దుకాణాల్లో పిల్లి బిర్యానీ విక్రయం.. రూ.50కే ఫుల్ ప్లేట్

చెన్నైలో రోడ్ సైడ్ అండ్ హోటల్ బిర్యానీ అంటే లొట్టలేసుకుని లాగించేసే భోజన ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్. పట్టణ వాసంలో సమయం లేదనో.. వండుకునేందుకు సమయం లేదనో రోడ్ సైడ్ అంగట్లో తినేస్తే ఓ పూట గడిచిపోతే సరిపో

చెన్నైలో రోడ్ సైడ్ అండ్ హోటల్ బిర్యానీ అంటే లొట్టలేసుకుని లాగించేసే భోజన ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్. పట్టణ వాసంలో సమయం లేదనో.. వండుకునేందుకు సమయం లేదనో రోడ్ సైడ్ అంగట్లో తినేస్తే ఓ పూట గడిచిపోతే సరిపోతుందని అందరూ అనుకుంటారు. చెన్నైలో యువకులు, చిరు ఉద్యోగులు, కార్మికుల భోజన అవసరాలను తీర్చేందుకు రోడ్ల పక్కన చిన్న హోటళ్లు, మొబైల్ వ్యాన్లు, భోజనం పాయింట్లపై ఆధారపడుతున్నారు.

వీరి అవసరాన్ని ఆసరా చేసుకుని పుట్టగొడుగుల్లా చిన్నతరహా క్యాంటీన్లు వెలుస్తున్నాయి. వీటిలో ఎక్కువగా అమ్ముడయ్యేది బిర్యానీ అని వ్యాపారులు అంటున్నారు. కేవలం 50 రూపాయలకే బిర్యానీ లభించడంతో దీనిని తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. 
 
అయితే ఇలా తక్కువ ధరకు లభించే బిర్యానీ చికెన్ లేక మటన్ బిర్యానీ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అది పిల్లి బిర్యానీ అని అధికారులు అంటున్నారు. భోజన ప్రియుల బలహీనతలను ఆసరాగా చేసుకున్న కొంతమంది పిల్లి బిర్యానీ అమ్ముతూ అది చికెన్ బిర్యానీ అని నమ్మిస్తున్నారు. పిల్లులను పెద్ద ఎత్తున పట్టుకొని వచ్చి వాటిని ఒక చోట జాలీలో బందించి వాటిని చంపి బిర్యానీ వండుతున్నారు. 
 
నిజానికి ఇటువంటి దుకాణాలలో తక్కువ ధరలకు భోజనం లభిస్తుండడంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సంచార జాతుల ద్వారా పిల్లుల్ని కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు అంటున్నారు. ఈ విషయం చెన్నై పోలీసులకు తెలియడంతో క్యాట్ బిర్యానీ నిర్వాహకులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక వాళ్ళ దగ్గర ఉన్న పిల్లులను జంతు సంరక్షణ వాళ్ళకు అప్పగించారు.