శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ivr
Last Modified: ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (09:19 IST)

చెన్నైకి రండి... హీరోయిన్లను చేస్తా... నెల్లూరు అమ్మాయిలతో వ్యభిచారం

సినిమాల్లో నటించాలనే కుతూహలంతో ఉన్న అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపి వారి జీవితాలతో ఆటలాడుతున్న ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేసారు. చెన్నైకు రండి.. మీకు హీరోయిన్ ఛాన్సులిప్పిస్తానంటూ నెల్లూరు జిల్లా నుంచి అమ్మాయిలను నమ్మించి, చెన్నైకు వెళ్లాక

సినిమాల్లో నటించాలనే కుతూహలంతో ఉన్న అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపి వారి జీవితాలతో ఆటలాడుతున్న ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేసారు. చెన్నైకు రండి.. మీకు హీరోయిన్ ఛాన్సులిప్పిస్తానంటూ నెల్లూరు జిల్లా నుంచి అమ్మాయిలను నమ్మించి, చెన్నైకు వెళ్లాక వారిని వ్యభిచారం కూపంలోకి నెట్టివేస్తున్న ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
ఫిర్యాదు అందుకున్న తమిళనాడులోని కాంచీపురం జిల్లా మధురవాయల్ పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. మధురవాయల్‌లోని కృష్ణానగర్‌లో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేయగా ముగ్గురు యువతులతో సహా ఇద్దరు పురుషులు పట్టుబడ్డారు. వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన మోహన్‌రెడ్డి ఉన్నాడు.