శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 6 జనవరి 2017 (16:27 IST)

శశికళ చిన్నమ్మా... ఎవరా మాటంది? నాలుక కోస్తాం... 'అమ్మ' నియోజకవర్గంలో నిరసనలు...

నాలుకలు కోయడాలు తెలంగాణ ఉద్యమ సమయంలో మనం చాలాసార్లు విన్నాం. ఇప్పుడు అలాంటి మాటలు తమిళనాడులోనూ వినబడుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటయా అంటే... తమిళనాడులో జయలలిత మరణం తర్వాత అక్కడ రాజకీయ పరిస్థితులు చకచకా మారిపోతున్నాయి. అమ్మ స్థానంలో శశికళ కూర్చున్నారు. ఆమ

నాలుకలు కోయడాలు తెలంగాణ ఉద్యమ సమయంలో మనం చాలాసార్లు విన్నాం. ఇప్పుడు అలాంటి మాటలు తమిళనాడులోనూ వినబడుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటయా అంటే... తమిళనాడులో జయలలిత మరణం తర్వాత అక్కడ రాజకీయ పరిస్థితులు చకచకా మారిపోతున్నాయి. అమ్మ స్థానంలో శశికళ కూర్చున్నారు. ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేదు కానీ పార్టీ పగ్గాలను చేపట్టారు. ఇదే ఊపుతో అమ్మ జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఉత్తర చెన్నై ఆర్కే నగర్ నుంచి శశికళ పోటీ చేసి, అమ్మలాగే ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. 
 
ఐతే దీనిపై నియోజకవర్గంలో తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. చిన్నమ్మ శశికళకు ఓటు వేసి గెలిపించండి అని కొందరు అక్కడ చెప్పగా... ఎవరా చిన్నమ్మా, ఆ మాట అన్నవారి నాలుక కోస్తాం... అమ్మ ఆసుపత్రిలో 75 రోజులకు పైగా వున్నప్పటికీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆమెను తమకు చూపించలేదనీ, ఇంత దారుణం చేసినవారికి ఓట్లు వేయాలా... వేయమంటే వేయం... ఇక్కడ అమ్మ మేనకోడలు దీపకు ఓట్లు వేసి గెలిపిస్తాం అంటున్నారు. పరిస్థితి చూస్తుంటే రాజకీయం శశికళ దగ్గర్నుంచి దీపకు మళ్లేట్లు కనిపిస్తోంది.