శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 22 ఏప్రియల్ 2017 (02:14 IST)

బుడ్డా పకీర్లకూ జయలలిత పేరే కావాలి. దీప భర్త కొత్త కుంపటి.. దీపకే ఆహ్వానం

కోట్లాది తమిళ ప్రజానీకాన్ని కంటి చూపుతో శాసించిన ఆ వీరనారి పురచ్చి తలైవి ఎక్కడ? కుక్కలు చింపిన విస్తరిలా మారిన తమిళ రాజకీయగంలో జుగుప్స కలిగిస్తున్న చోటో మోటా రాజకీయాలెక్కడ? అమ్మ వారసత్వం మాదంటే మాదని కొట్టుకుచస్తున్న అన్నాడీఎంకే ప్రత్యర్థి వర్గాలు ఒక

కోట్లాది తమిళ ప్రజానీకాన్ని కంటి చూపుతో శాసించిన ఆ వీరనారి పురచ్చి తలైవి ఎక్కడ? కుక్కలు చింపిన విస్తరిలా మారిన తమిళ రాజకీయగంలో జుగుప్స కలిగిస్తున్న చోటో మోటా రాజకీయాలెక్కడ? అమ్మ వారసత్వం మాదంటే మాదని కొట్టుకుచస్తున్న అన్నాడీఎంకే ప్రత్యర్థి వర్గాలు ఒక షో చూపిస్తుండగా జయలలిత మేనకోడలు దీప ఒక పార్టీతో ముందుకొచ్చి షో నడుపుతుండటం తెలిసిందే. ఇప్పుడు పోటీగా మరొక బడుద్దాయి వచ్చేశాడు. ఇతగాడు దీప భర్త మాధవన్. ఇతడి పార్టీ పేరు ఎంజీఆర్‌ జయలలిత ద్రవిడ మున్నేట్ర కళగం (ఎంజేడీఎంకే) అట. అధికారం, రాజకీయం  ఈ రెండింటి చుట్టూనే ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు మొత్తంగా తిరుగుతున్నాయి.
 
తమిళనాడులో అమ్మ జయలిలత పేరిట మరో కొత్తపార్టీ జీవంపోసుకుంది. దివంగ సీఎం జయలలిత మేనకోడలు దీప భర్త మాధవన్‌ ‘ఎంజీఆర్‌ జయలలిత ద్రవిడ మున్నేట్ర కళగం’ (ఎంజేడీఎంకే) అనే కొత్త పార్టీని స్థాపించారు. శుక్రవారం ఉదయం జయలలిత సమాధి వద్దకు వెళ్లి అంజలి ఘటించిన మాధవన్‌.. ఆ తరువాత పార్టీ పేరును ప్రకటించి పతాకాన్ని ఆవిష్కరించారు. దీప పేరవైకి తన పార్టీకి సంబంధం లేదని, దీపకు ఇష్టమైతే తన పార్టీలో చేరవచ్చని తెలిపారు. 
 
అన్నాడీఎంకేలో వర్గపోరు కారణంగా ఎవరికీ దక్కకుండాపోయిన రెండాకుల చిహ్నాన్ని తాము సాధిస్తానని మాధవన్‌ మీడియాకు చెప్పారు. ఇటీవలి ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో పోటీకి దిగిన దీప.. తన నామినేషన్‌ పత్రాల్లో భర్త పేరును రాయనికారణంగా దంపతుల మధ్య విబేధాలు చెలరేగాయి. నాటి నుంచి ఇరువురి మధ్య మనస్పర్థలు అంతకంతకూ పెద్దవవుతూ వచ్చాయి. అంబేడ్కర్‌ జయంతి రోజున దీప, మాధవన్‌ల అనుచరులు తీవ్రంగా ఘర్షణపడ్డారు. కొన్నిరోజులుగా దీపను వదిలివేరుగా ఉంటున్న మాధవన్‌ రాజకీయ పార్టీని పెట్టడం చర్చనీయాంశమైంది.