గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (09:02 IST)

అమ్మతో మాట్లాడినా సహించని భూతం శశికళ: మండిపడ్డ సెల్వం

ఒక వైపు అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు తన పక్షం చేరకపోవడం, మరోవైపు తనను అమ్మకు ద్రోహం చేసిన వ్యక్తిగా శశికళ కువత్తూర్ క్యాంపులో తిట్టిపోయడం నేపథ్యంలో తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శివమెత్తిపోయారు. అమ్మకు ద్రోహం చేసినవాడిని కాదు, అమ్మ కో

ఒక వైపు అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు తన పక్షం చేరకపోవడం, మరోవైపు తనను అమ్మకు ద్రోహం చేసిన వ్యక్తిగా శశికళ కువత్తూర్ క్యాంపులో తిట్టిపోయడం నేపథ్యంలో తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శివమెత్తిపోయారు. అమ్మకు ద్రోహం చేసినవాడిని కాదు, అమ్మ కోసం పదిహేనేళ్ల నుంచి అవమానాలు భరిస్తూనే వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
‘‘అమ్మ నన్ను ఆప్యాయంగా పలకరిస్తే చాలు... క్షణాల్లో శశికళ నుంచి చీవాట్లు పడేవి. పదిహేను, పదహారేళ్లు అడుగ డుగునా అవమానాలు మౌనంగానే భరించా.. నాలో నేను రోదించా. అమ్మ తన వారసుడిని తయారు చేసుకునే ప్రయత్నం చేసినా శశికళ అడ్డుకున్నారు. పార్టీలో ఉన్న వారందరినీ బయటకు వెళ్లేలా చేశారు. ‘అమ్మ’ కోసం ఇవన్నీ భరించి ఆమెతోనే ఉన్నా’’ అని పన్నీర్‌ సెల్వం చెప్పారు. 
 
‘‘జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా కనీసం దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా శశికళ అడ్డుకున్నారు. అమ్మ మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదనన్‌ పేరు ప్రతిపాదనకు వచ్చింది. కానీ, శశికళ ఆ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చు కున్నారు. అమ్మ రక్త సంబంధీకులు దీప, దీపక్‌లను పార్థివదేహం దగ్గరకు రానివ్వ కుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను పదవిలో ఉన్నా, అప్పుడు స్వతం త్రంగా వ్యవ హరించలేని నిస్స హాయుడిగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని పన్నీర్‌ వెల్లడించారు. 
 
‘‘నేను ఎదుర్కొన్న కష్టాలు, చేసిన సేవలను జయలలిత స్వయంగా కార్యకర్తలకు వివరించి న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శశికళ నుంచి ఎన్నో అవమానాలు ఎదురైనా, ఎన్నడూ ‘అమ్మ’ దృష్టికి తీసుకెళ్లలేదు. ‘అమ్మ’ తన  రాజకీయ వారసుడిని తయారు చేసుకునేం దుకు సిద్ధపడ్డా, శశికళ ఎవరినీ ఎదగనివ్వ లేదు. నన్ను బయటకు పంపించేందుకు కుట్రలు పన్నినా కేవలం జయలలిత కోసం అన్నీ దిగమింగుకున్నా. ఇతరులపై చాడీలు చెప్పడం, నిందలు వేయడం నాకు చేతకాదు. నేను సింహాన్ని కాదు’’ అని పన్నీర్‌ సెల్వం పరోక్షంగా శశికళను ఎద్దేవా చేశారు.
 
క్యాంప్‌(శశికళ శిబిరం)లో ఉన్న ఎమ్మెల్యేలు దయచేసి నియోజకవర్గాల్లోకి వెళ్లాలని, ప్రజలతో చర్చించి మనస్సాక్షికి కట్టు బడి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచిం చారు. ఆదివారం కువత్తూరు వేదికగా ఎమ్మె ల్యేలను ఉద్దేశించి శశికళ ప్రసంగం ముగిసిన కాసేపటికి సీఎం పన్నీర్‌ సెల్వం గ్రీన్‌వేస్‌ రోడ్డులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని వివరించారు.