గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 11 మే 2017 (09:13 IST)

జయ కొడనాడు ఎస్టేట్ కాదు.. రూ. 900 కోట్ల గని.. బుధవారం నుంచి ఐటీ అధికారుల తనిఖీ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రిదిగా చెప్పుకుంటున్న కొడనాడు ఎస్టేట్ అతిథి గృహం కాదని అది వందలకోట్ల నగదు, ఆభరణాల గని అని అత్యంత విశ్వసనీయమైన సమాచారం బట్టి తెలుస్తోంది. దీంతో ఈ ఎస్టేట్ కమ్ డబ్బుల గని వ్యవహా

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రిదిగా చెప్పుకుంటున్న కొడనాడు ఎస్టేట్ అతిథి గృహం కాదని అది వందలకోట్ల నగదు, ఆభరణాల గని అని అత్యంత విశ్వసనీయమైన సమాచారం బట్టి తెలుస్తోంది.  దీంతో ఈ ఎస్టేట్ కమ్ డబ్బుల గని వ్యవహారం తేల్చి వేయాలని బుధవారం నుంచి ఐటీ శాఖ కొడనాడు ఎస్టేట్‌లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం ఎస్టేట్‌లోకి కొందరు వ్యక్తులు ప్రవేశించగా వారంతా ఐటీ అధికారులుగా అనుమానిస్తున్నారు. 
 
నీలగిరి జిల్లా కొడనాడులో జయలలితకు సొంతమైన ఎస్టేట్‌లోకి గత నెల 23వ తేదీన 11 మందితో కూడిన గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి అక్కడి సెక్యూరిటీ గార్డును హతమార్చి, మూడు గదుల్లోని దాచి ఉంచిన భారీ నగదు, ముఖ్యమైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి 9 మంది అరెస్ట్‌ కాగా, జయలలిత కారు మాజీ డ్రైడర్‌ కనకరాజ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మరో వ్యక్తికోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
ఇదిలా ఉండగా, జయలలిత, శశికళ పడక గదుల్లో రూ.200 కోట్లకు పైగా నగదు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మూడు కంటైనర్‌ లారీల్లో పట్టుబడిన రూ.570 కోట్లలో మిగిలిన రూ.900 కోట్ల నగదు ఎస్టేట్‌లోని అనేక గదుల్లో దాచిపెట్టి ఉండగా, ఈ సొత్తును దోచుకునేందుకే ఎస్టేట్‌లోకి జొరబడినట్లు పట్టుబడిన ఇద్దరు నిందితులు పోలీసులకు చెప్పారు. అంతేగాక ఎస్టేట్‌లోని అనేక ర్యాకులు, సూట్‌కేసుల్లోని కట్టలు కట్టలు నగుదును చూసి తాము బిత్తరపోయామని వారు తెలిపారు.
 
ఈ నేపధ్యంలో బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో కొందరు వ్యక్తులు 3 వాహనాల్లో కొడనాడు ఎస్టేట్‌లోకి వెళ్లారు. ఈ రెండు వాహనాల్లో సుమారు పది మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు లోపలికి వెళ్లగా 11 ప్రవేశద్వారాలను మూసివేశారు. ఇతరులు ఎవ్వరూ ప్రవేశించగకుండా సుమారు అరకిలోమీటరు దూరంలో బ్యారికేడ్లను అడ్డుగా పెట్టి పట్టపగలు అంతాగోప్యంగా సాగడంతో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.