బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By tj
Last Updated : శనివారం, 11 మార్చి 2017 (14:14 IST)

ఆర్.కే.నగర్‌లో దినకరన్ - దీపా జయకుమార్‌ల మధ్యే పోటీ...!

తమిళనాడు రాజకీయాలు ఒక్కో రోజు ఒక్కో విధంగా మారిపోతున్నాయి. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం కోసం ఒకరినొకరు గొడవలు పడి చివరకు చిన్న

తమిళనాడు రాజకీయాలు ఒక్కో రోజు ఒక్కో విధంగా మారిపోతున్నాయి. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం కోసం ఒకరినొకరు గొడవలు పడి చివరకు చిన్నమ్మ శశికళ వర్గం విజయకేతనం ఎగురవేస్తే ఆ తర్వాత కూడా మిగిలిన వారు ఏ మాత్రం తగ్గలేదు. కారణం రాజకీయం కాబట్టి.
 
ప్రస్తుతం ఆర్కేనగర్‌లో జరిగే ఎన్నికలే ఆశక్తిగా మారాయి. జయలలిత ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన ప్రాంతమిది. అయితే ఎన్నికల కమిషన్ ఉన్నట్లుండి ఏప్రిల్ 12వ తేదీ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైంది. దీంతో ఆ ఉప ఎన్నికల్లో గెలవడానికి ఒక్కొక్కరు ఒక్కో విధమైన ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా శశికళ తరపున సిఎంగా ఉన్న పళణిస్వామి ఆర్ కే నగర్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవడానికి అప్పుడూ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. అయితే అభ్యర్థి ఎవరన్నది చిన్నమ్మ నిర్ణయిస్తుంది. 
 
ఇక మరో ప్రధానమైన విషయం జయలలిత మేనకోడలుగా రాజకీయ అరగేట్రం చేసిన దీపా జయకుమార్. దీప ఇప్పటికే పార్టీని ప్రకటించి ఆర్కే.నగర్‌లో నిలబడేందుకు సిద్థమయ్యాయరు. ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించారు కూడా. కానీ దీపకు వచ్చిన చిక్కల్లా సొంతంగా పోటీ చేస్తే ఇబ్బంది పడక తప్పదు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో ఆమె జతకడితే ఖచ్చితంగా గెలుపు దీపను వరిస్తుందనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 
 
అయితే ఇప్పటికే దీప పన్నీరుసెల్వంతో కలవనని చెబుతూ వచ్చారు. కానీ దీపకు మరో ప్లస్ పాయింట్ కూడా ఉంది. అదే చిన్నమ్మ శశికళపై ఆర్కే.నగర్ ప్రజల ఆగ్రహం. చిన్నమ్మే ఎన్నికల్లో నిలబడితే ఓడిస్తామని ఆ ప్రాంత ప్రజలు శశికళ జైలుకు వెళ్ళకముందే చెప్పారు. అలాంటిది శశికళ ఎవరినైనా నిలబెట్టినా ఓటమి ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 
ఎవరెన్ని అనుకున్నా శశికళ మాత్రం ఆర్కే.నగర్ నుంచి పోటీలో నిలబట్టపోయేది ఆమె అన్న కుమారుడు టిటివి.దినకరన్. ఇది ముందు నుంచి తెలిసిందే. అయితే ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న దినకరన్ ఒక్కసారిగా చెలరేగిపోతారన్నది రాజకీయ విశ్లేషకులు భావన. డిఎంకే పార్టీ తరపున అభ్యర్థి నిలబడినా ఏ మాత్రం ఉపయోగలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేవలం దీపా జయకుమార్, టిటివి.దినకరన్‌ల మధ్యే పోటీ రసవత్తరంగా ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.