Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిర్లక్ష్యమే జయలలిత మృతికి ప్రధాన కారణం.. బాంబు పేల్చిన నటరాజన్

హైదరాబాద్, శుక్రవారం, 7 జులై 2017 (04:43 IST)

Widgets Magazine
jayalalithaa

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత తన ఆరోగ్యం విషయంలో ప్రదర్శించిన తీవ్ర నిర్లక్ష్యమే మా అందరి కొంప ముంచిందిని జయ సహచరి భర్త నటరాజన్ పేర్కొన్నారు. జయలలిత మరణంలో ఎలాంటి అనుమానాల్లేవు కానీ ఆమె మరణించారన్న విషయాన్ని తానిప్పటికీ జీర్ణించుకోలోకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. జయలలిత ఆగ్రహానికి గురై ఆమె నివాస గృహం పోయెస్ గార్డెన్ నుంచి బహిష్కరణకు గురైన నటరాజన్ జయ లలిత మృతికి సంబంధించి తనదైన వివరణ ఇవ్వడం ఆసక్తి గొలుపుతోంది. 
 
తన ఆరోగ్యం గురించి జయలలిత నిర్లక్ష్యం వహించినట్టున్నారని నటరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయం నుంచి బయటకు వచ్చే సమయంలో, కారు ఎక్కే సమయంలో ఆమెకు సాయంగా భద్రతాధికారులు చేతిని అందించే వారని, ఆ అధికారులైనా ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దని సూచించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. రోగం వస్తే మందులు వేసుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే సమస్య జఠిలం అవుతుందన్న విషయాన్ని పరిగణించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆమె మరికొంత కాలం తమిళ ప్రజలకు సేవలు అందిస్తారని భావించినట్టు తెలిపారు. కానీ అంత సడన్‌గా తమిళ ప్రజలను శోకంలో ముంచెత్తుతూ జయలలిత కన్నుమూస్తారని ఎన్నడూ అనుకోలేదన్నారు.
 
జయలలితను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా వెన్నంటి ఉన్నారని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అమ్మ మరణంలో ఎలాంటి అనుమానాలు లేవు అని, రాజకీయ లబ్ధి కోసం పన్నీరు సెల్వం లాంటి వాళ్లు ఆరోపణలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. అనుమానం అన్నది ఉండి ఉంటే, సీబీఐ విచారణకు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఆదేశించి ఉండాల్సిందని పేర్కొన్నారు. అపోలో, ఎయిమ్స్‌ , లండన్‌ వైద్యులు అమ్మ ఆరోగ్యం మెరుగుకు అందించిన చికిత్సల గురించి ఇప్పటికే వివరించి ఉన్నారని, అలాంటప్పుడు అనుమానాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. 
 
శశికళ సహచరుడు నటరాజన్ చెబుతున్న విషయాలు తన ఆరోగ్యం విషయంలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదని ముందునుంచి ఉన్న అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి.  మధుమేహ వ్యాధిగ్రస్తురాలైన జయలలిత ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాసెడు మామిడి పళ్ల రసాన్ని తాగేవారని ఆమె ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే వార్తలొచ్చాయి. ఆమె ఆసుపత్రికి చేరిన రోజు షుకర్ లెవర్స్ 700 పాయింట్ల వరకు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని కూడా వార్తలు వచ్చాయి. 
 
షుగర్ రోగులకు మామిడిపళ్లు కానీ మ్యాంగో జ్యూస్ కానీ ప్రాణాంతకమన్న విషయం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదా. తనకు తెలియక పోతే తనకు చేదోడువాదుడుగా ఉన్నవారికి తెలీదా. తెలిసినప్పటికీ జయలలితను వారు ఏమార్చారా లేక జయలలితే మ్యాంగో జ్యూస్‌పట్ల అనకుండే వ్యామోహాన్ని నియంత్రించుకోలేకపోయారా.. ఈ మొత్తం వ్యవహారంలో శశికళ పాత్ర ఎంత అనేది స్పష్టం కావటం లేదు. 
 
విశ్వసనీయ వార్తలు చెబుతున్నదేమిటంటే రెండో దఫా కూడా అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన తర్వాత జయలలిత బహిరంగ సభల్లో పాల్గొనలేదని, సచివాలయానికి కూడా రావటం తగ్గించారని తెలిసింది. ఆమె విశ్రాంతిలో ఉన్నప్పుడే ఆమె కాలికి గాంగ్రిన్ వచ్చి పాదాన్ని తీసేశారని కూడా పుకార్లు వచ్చాయి. అందుకే మరణించిన తర్వాత కూడా జయ పాదాలను ప్రజలకు కనిపించకుండా పూర్తిగా కప్పి ఉంచడం మరిన్ని అనుమానాలను రేపుతోంది. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చదివింది 8వ క్లాస్, 15మంది మగ పిల్లలపై అత్యాచారం.. ఇప్పుడు హత్య కూడా.. వీడు మనిషేనా?

ఎనిమిదో తరగతివరకు చదివిన 17 సంవత్సరాల మైనర్ బాలుడు పొరుగున ఉన్న పదేళ్ల అబ్బాయిపై అసహజమైన ...

news

మాట్లాడను పో... చైనా.. మాట్లాడాలని అడిగామా.. భారత్ కౌంటర్‌తో దిమ్మతిరిగిన చైనా

జర్మనీలోని హాంబర్గ్‌లో జీ-20 సమావేశాలు శుక్రవారం నుంచి జరుగనున్న నేపథ్యంలో తమ ...

news

నెలకు రూ.100 ప్రీమియంతో రూ.2 లక్షలు... 1044 వ్యాధులకు చికిత్స... కామినేని

అమరావతి, జులై,6: రాష్ట్రంలో ప్రస్తుతం వైద్య,ఆరోగ్య శాఖలో అమలవుతున్న హెల్త్ ఇన్సూరెన్స్ ...

news

మద్యం వ్యాపారం ప్రధాన ఆదాయ వనరు కాదు... ఎక్సైజ్ శాఖా మంత్రి జవహర్

అమరావతి : మద్యం దుకాణాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులున్నా.. ప్రజలు నేరుగా తనకు ...

Widgets Magazine