శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 11 ఫిబ్రవరి 2017 (04:46 IST)

ప్రమాణ స్వీకారమూ పోయె.. బందోబస్తూ పోయె.. శశికి మిగిలినవి శాపనార్థాలే..!

ముఖ్యమంత్రి కుర్చీకోసం తలపడుతున్న ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ శుక్రవారం రాజకీయాన్ని మరింత రసవత్తర స్థాయికి చేర్చారు. శశికళ ప్రమాణ స్వీకారం కోసం మద్రాసు యూనివర్సిటీ ఆవరణంలో ఏర్పాటు చేసిన బందోబస్తును పన్

ముఖ్యమంత్రి కుర్చీకోసం తలపడుతున్న ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ శుక్రవారం రాజకీయాన్ని మరింత రసవత్తర స్థాయికి చేర్చారు. శశికళ ప్రమాణ స్వీకారం కోసం మద్రాసు యూనివర్సిటీ ఆవరణంలో ఏర్పాటు చేసిన బందోబస్తును పన్నీర్‌ తొలగింపచేశారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పుట్టిన అన్నాడీఎంకేను ఎట్టి పరిస్థితుల్లోనూ శశికళ కుటుంబం చేతుల్లో పడనీయబోమని ప్రకటించారు.
 
అమ్మ జయలలిత చీరలాగిన డీఎంకేతో అంటకాగుతున్న పన్నీర్‌ సెల్వం పచ్చి ద్రోహి అని శశికళ దీటుగా ధ్వజమెత్తారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా తాను కచ్చితంగా బాధ్యతలు స్వీకరిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పన్నీర్‌ శిబిరంలో చేరిన ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌ను పార్టీ నుంచి బహిష్కరించి... ఆయన స్థానంలో మాజీమంత్రి సెంగోట్టియన్‌ను నియమించారు. 
 
ఇందుకు ప్రతి చర్యగా మధుసూదనన్‌ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికే చెల్లదంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. శశికళను పార్టీ నుంచి బహిష్కరించడంతోపాటు ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దుచేశామని ప్రకటించారు. పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయం (జయలలిత ఇల్లు)ను అమ్మ స్మారకమందిరంగా మార్చుతామని వెల్లడించారు.