గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (05:57 IST)

సందిగ్ధంలో చిన్నమ్మ... సంబరంలో పన్నీర్.. కళ్లముందే తారుమారైన బలాబలాలు

ఒక్క రోజులో తమిళనాడు రాజకీయ పరిణామాలు శరవేగంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పక్షం తిరిగిపోయాయి. ఎంత తిరుగుబాటు ప్రకటించినా చిన్నమ్మ శిబిరంలో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బంధనాలు తెంచుకుని పన్నీర్ గూట్లోకి వస్తారా, మ్యాజిక్ ఫిగర్‌కు సరిపోయే న

ఒక్క  రోజులో తమిళనాడు రాజకీయ పరిణామాలు శరవేగంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పక్షం తిరిగిపోయాయి. ఎంత తిరుగుబాటు ప్రకటించినా చిన్నమ్మ శిబిరంలో ఉన్న  అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బంధనాలు తెంచుకుని పన్నీర్ గూట్లోకి వస్తారా, మ్యాజిక్ ఫిగర్‌కు సరిపోయే నంబర్ గేమ్‌లో పన్నీర్ సెల్వం గెలువుగలడా అనే అనుమానాలు కొద్దిగంటల్లోనే మాసిపోయాయి. శనివారం సెల్వం గూటికి చేరిన ఇద్దరు సీనియర్ నేతలు మొత్తం బలాబలాలను తారుమారు చేసేసారు. ఇక పన్నీర్ బాట గెలుపుబాటే అనే స్థాయిలో అనుకూల వాతావరణాన్ని వీరిద్దరూ తెప్పించేశారు. దీనిఫలితం పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదొరై తప్పితే మిగిలిన అన్నాడీఎంకే ఎంపీలందరూ పన్నీర్ సెల్వం పక్షానికి వచ్చేసినట్లే.. ఇంత కీలక పరిణామం ఎలా సాధ్యమైంది?
 
నిన్నటి వరకు చిన్నమ్మ వెంట ఉన్న విద్యాశాఖ మంత్రి పాండియరాజన్, పార్టీ సీనియర్‌ నాయకుడు పొన్నయ్యన్ పన్నీరుకు మద్దతుగా ముందుకు రావడం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి శిబిరానికి మహదానందం కలిగించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు మరికొద్ది రోజుల్లో పన్నీరు సమక్షంలో మద్దతు ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారని పాండియరాజన్  చేసిన వ్యాఖ్యలు, కోటిన్నర మంది అన్నాడీఎంకే కేడర్‌ పన్నీరు వెంట నడవబోతున్నారన్న పొన్నయ్యన్  ప్రకటన ఆ శిబిరాన్ని ఆనందపు జల్లుల్లో ముంచింది. అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్‌ అవకాశం ఇస్తే, పన్నీరు నెగ్గడం ఖాయం అన్న ధీమాను వ్యక్తం చేసే మద్దతుదారుల సంఖ్య పెరుగుతుండడం గమనార్హం.
 
దీనికి తోడుగా ఒకే రోజు ముగ్గురు ఎంపీలు కదలి రావడం, ఓ మంత్రి, పార్టీ సీనియర్‌ నాయకుడు సైతం మద్దతు ప్రకటించడం వెరసి ఆ శిబిరంలో ఆనందాన్ని నింపాయి. నామక్కల్‌ ఎంపీ సుందరం, కృష్ణగిరి ఎంపీ అశోక్‌కుమార్, తిరుప్పూర్‌ ఎంపీ సత్యభామా, తిరువణ్ణామలై ఎంపీ వనరోజా తమ మద్దతును ప్రకటించినానంతరం చేసిన వ్యాఖ్యలు పన్నీరు శిబిరంలో మరింత జోష్‌ నింపాయి.పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై మినహా తక్కిన ఎంపీలు అందరూ పన్నీరు వెంట నడవడం ఖాయం అని వారు చేసిన వ్యాఖ్యలతో ఆ శిబిరంలో ఉత్సాహం రెట్టింపు అయింది. అలాగే, ఎమ్మెల్యేలు తప్పకండా పన్నీరుకు అండగా నిలబడి తీరుతారని మాజీ ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో తరలి వచ్చి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు
 
ఇక, అమ్మ జయలలిత బాల్య మిత్రులు , స్కూల్‌ మెంట్స్‌ శ్రీమతి అయ్యంగార్, శాంతినీ పంకజ్, పదర్‌ సయ్యద్‌ సైతం పన్నీరుకే తమ ఓటు అని ఓ మీడియా ముందు ప్రకటించడాన్ని మద్దతుదారులు ఆహ్వానిస్తున్నారు.
 
ఇక, చిన్నమ్మ శిబిరం నుంచి మంత్రులు దిండుగల్‌ శ్రీనివాసన్, కేటీ రాజేంద్ర బాలాజీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సెంథిల్‌ బాలాజీ జంప్‌ అయ్యారన్న సమాచారంతో, వారు తప్పకుండా తమ శిబిరంలోకి అడుగు పెడుతారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు.