గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (06:49 IST)

మీ స్వీట్లు మీరే పెట్టుకోండి మాకొద్దంటూ ఛీత్కరిస్తున్న తమిళులు : పళనికి భంగపాటు

అధికార పార్టీ ఎమ్మెల్యేలను, బలపరీక్షలో నెగ్గిన వర్గం ఎమ్మెల్యేలను ప్రజలు ఇంతగా ఛీకొడుతున్న ఘటనలు ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నాయి. అమ్మనమ్మని, అమ్మ దూరం పెట్టిన శశికళకు ఆమె బంధువులకు అధికారం అప్పనంగా అందించిన తమ వీర ఎమ్మెల్యేలను చూసి గ్రామగ్రామాల్లో

గోల్డెన్ రిసార్టులో జరిపిన కుట్రల సాక్షిగా శశికళ వర్గం తమిళనాడు పాలిట్రిక్స్‌లో విజయం సాధించి ఉండవచ్చు. 122 మంది ఎమ్మెల్యేల దన్నుతో శశికళ నమ్మినబంటు పళనిస్వామి అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గి విజయహాసం చేసి ఉండవచ్చు. కానీ ఇటీవలి రాజకీయ చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలను, బలపరీక్షలో నెగ్గిన వర్గం ఎమ్మెల్యేలను ప్రజలు ఇంతగా ఛీకొడుతున్న ఘటనలు ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నాయి. అమ్మనమ్మని, అమ్మ దూరం పెట్టిన శశికళకు ఆమె బంధువులకు అధికారం అప్పనంగా అందించిన తమ వీర ఎమ్మెల్యేలను చూసి గ్రామగ్రామాల్లో జనం ఉమ్మి వేసి చీత్కరిస్తున్నారు. ఇదే ఏ స్థాయికి వెళ్లిందంటే బలపరీక్షలో నెగ్గిన సీఎం పళనిస్వామికి సొంత జిల్లా సేలంలో ఘోరావమానం జరిగింది. తమ నేత ముఖ్యమంత్రి అయ్యారన్న సంతోషంతో పళని అనుచరులు భారీ మొత్తంలో స్వీట్లు పంచబోగా వాటిని తీసుకునేందుకు ప్రజలు నిరాకరించడం సంచలన వార్తగా మారింది. ఇలా ఎంత కాలం నడుస్తుందో తెలీదు కానీ తమిళనాడు ప్రజలు బలపరీక్షలో గెలిచిన నేతలను, ముఖ్యమంత్రిని కూడా నమ్మలేదన్నది మాత్రం రాజకీయ నేతలు కలకాలం గుర్తుంచుకోవలసిన ఘటనగా నిలుస్తోంది.
 
ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి సొంత జిల్లా సేలంలో ఓ వింత పరిస్థితి ఏర్పడింది. తమ నేత ముఖ్యమంత్రి అయ్యారన్న సంతోషంలో పళనిస్వామి అనుచరులు భారీ మొత్తంలో స్వీట్లు పంచారు. అయితే, వీటిని తీసుకునేందుకు ప్రజలు నిరాకరించారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్ళూరిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ... అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించడంతో జైలుకెళ్ళారు. దీంతో ఆమె తన ప్రధాన అనుచరుడు ఎడప్పాడి కె. పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. దీంతో ఆయనతో గవర్నర్‌ సీహెచ విద్యాసాగరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
ఈ నేపథ్యంలో ఎడప్పాడి పళనిస్వామి శనివారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయం సాధించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు, అన్నాడీఎంకే కార్యకర్తలు సేలంలో బాణాసంచా పేల్చుతూ స్వీట్లు పంపిణీ చేసేందుకు పూనుకున్నారు. అయితే, ఈ స్వీట్లు తీసుకునేందుకు నిరాకరించారు. అంతేకాకుండా, వారు శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం గమనార్హం.