శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : శనివారం, 3 జనవరి 2015 (13:49 IST)

పిల్లల్లో పళ్ళు ఊడిపోయినప్పుడు ఆకలి మందగిస్తుందట!

పిల్లల్లో పాలపళ్ళు ఊడిపోయినప్పుడు ఆకలి మందగిస్తుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. తద్వారా బరువు తగ్గుతారు. పళ్ళొచ్చే సమయంలో ఉండే అసౌకర్యం వల్ల పిల్లలు సరిగ్గా తినరు. అందువల్ల బరువు తగ్గుతారు.
 
శిశువులలో నాలుగు నెలలు వచ్చినప్పటి నుంచి టీతింగ్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. అయితే, ప్రతి శిశువులో టీతింగ్ ప్రాసెస్ ఒకేలా ఉండదు. శిశువుకు చేరుతున్న కాల్షియం వంటి ఎన్నో అంశాలు టీతింగ్ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పాల పళ్ళు ఊడిపోయే ప్రతీసారి పిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో ఆకలి మందగిస్తుంది.
 
చిగుళ్ళ నొప్పి, మంట ఇవన్నీ టీతింగ్ ప్రాసెస్ వల్ల కలిగేఅసౌకర్యాలు. చిగుళ్ళలోంచి పళ్ళు బలంగా బయటకు రావడానికి ప్రయత్నించే సమయంలో పిల్లలు నొప్పితో బాధపడతారని, తద్వారా బరువు తగ్గడం సాధారణమేనని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.