బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2016 (18:07 IST)

పిల్లలకు జబ్బు చేస్తే పడకగదికే పరిమితం చేయకండి.. అలా తిరగాడనివ్వండి..

పిల్లలకు జబ్బు చేస్తే పడకగదికే పరిమితం చేయకండి.. అలా తిరగాడనివ్వండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. పిల్లలకు జబ్బు చేస్తే పెద్దలు కంగారుపడి.. వారి పక్కనే కూర్చుని.. వారిని పడకగదికే పరిమితం చేయకుండా..

పిల్లలకు జబ్బు చేస్తే పడకగదికే పరిమితం చేయకండి.. అలా తిరగాడనివ్వండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. పిల్లలకు జబ్బు చేస్తే పెద్దలు కంగారుపడి.. వారి పక్కనే కూర్చుని.. వారిని పడకగదికే పరిమితం చేయకుండా.. అందరూ తిరిగే తోట సోఫా మీద పడుకోబెట్టడం మంచిది.

ఇలా చేస్తే ఇంట్లో వాళ్లకు వారిని కనిపెట్టుకోవడం సులభం అవుతుంది. పిల్లలకు వినోదం కలిగించే ప్రయత్నం చేస్తే వారిలో కొత్త హుషారు వస్తుంది. బొమ్మలు గీయటం, నోటుబుక్‌లో బొమ్మలు అతికించటం వంటివి చేయిస్తే తాము అనారోగ్యం పాలయ్యామనే విషయాన్ని వారు మెల్ల మెల్లగా మరిచిపోతారు. 
 
జబ్బు తగ్గేవరకు పిల్లలను విశ్రాంతి తీసుకోనిచ్చి.. పిల్లలు కాస్త కోలుకున్నామని, లేచి ఆడుకోగలమని భావిస్తే.. వారిని ఇంట్లో ఆడుకోనివ్వటం మంచిది. ఒకవేళ పిల్లలు మంచం మీది నుంచి లేవలేకపోతున్నా, విశ్రాంతి అవసరమని డాక్టర్‌ చెప్పినపుడు మాత్రం పిల్లలకు విసుగు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పెద్దలు పక్కనే వుండి వారిని చూసుకోవడం అవసరమని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.