శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : బుధవారం, 9 జులై 2014 (18:00 IST)

మీ పిల్లలు బొద్దుగా ఉన్నారా? అయితే జాగ్రత్త సుమా!

పిల్లలు బొద్దుగా ఉన్నారా.. తెగ ముద్దొస్తున్నారా? అయితే జాగ్రత్త పడాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన పెద్దలు 10, 15 మందికి జన్మనిస్తే.. ప్రస్తుతం ఆధునికత కారణంగా ఆ సంఖ్య క్రమేణా తగ్గి ఒక శిశువు లేదా ఇద్దరు శిశువులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తల్లి కావడం గొప్ప అనుభూతే. అలాగే శిశువుకు జన్మనివ్వడం కంటే వారిని పెంచడంలోనే అధిక శ్రద్ధ తీసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంకా తమ పిల్లలు బొద్దుగా ఉండాలని అనేకమంది పారెంట్స్ ఆశిస్తున్నారు. పుట్టిన తొలి సంవత్సరంలోనే శిశువు బొద్దుగా ఉంటే.. ఆ బిడ్డ పెరగనూ పెరగనూ 80 శాతం బొద్దుగానే కనిపిస్తాడని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. పిల్లలు బొద్దుగా పెరగడం ద్వారా అనేక సమస్యలు తప్పవని వారు చెబుతున్నారు. మానసికంగా, శారీరకంగా బొద్దుగా ఉండే పిల్లలకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి పిల్లలు బొద్దుగా ఉండాలనే ఆలోచనను తల్లిదండ్రులు తప్పకుండా పక్కన పెట్టాల్సిందే. పిల్లలు సన్నగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగా ఉండాలని తల్లిదండ్రులు ఆశించాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
 
మీ పిల్లలు బొద్దుగా ఉంటే.. నీరసం, ఆడుకోవకపోవడం, ఎప్పడూ టీవీలకు అతుక్కుపోవడం, లేకుంటే వీడియో గేమ్స్ ఆడటం, చదువుపై శ్రద్ధ చూపకపోవడం వంటివి జరుగుతాయి. ఎముకుల పెరుగుదల కూడా తగ్గుతుంది. దీంతో ఐదేళ్లలోనే రక్తపోటు వంటివి ఏర్పడే ఛాన్సుంది. అందుచేత పిల్లలు వయస్సు తగిన బరువు, ఎత్తును కలిగివున్నారా లేదా అనేది వైద్యుల సలహా మేరకు అప్పుడప్పుడు తెలుసుకోవడం మంచిది. ఇంకా బరువు తగ్గాలంటే వ్యాయామం అలవాటు చేయాలి. ఆడుకోనివ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.