శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2017 (11:48 IST)

పిల్లలను ఒత్తిడికి గురిచేయకండి.. ఇతరులతో పోల్చకండి..

పిల్లలు నలుగురితో కలిసిపోవాలంటే.. ఇతరులతో పోల్చడం మానేయాలి. చిన్నారుల్లో భావోద్వేగాలు, ఆత్మన్యూనతా భావం ఎక్కువగా ఉంటుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఇతరులతో పోల్చడం, వెక్కిరింపులకు గురిచేయడం, పే

పిల్లలు నలుగురితో కలిసిపోవాలంటే.. ఇతరులతో పోల్చడం మానేయాలి. చిన్నారుల్లో భావోద్వేగాలు, ఆత్మన్యూనతా భావం ఎక్కువగా ఉంటుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఇతరులతో పోల్చడం, వెక్కిరింపులకు గురిచేయడం, పేర్లు పెట్టడం, నలుగురిలోనూ చులకన చేసి మాట్లాడటం.. తద్వారా వారు మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది.

అందుకే వారిని ఇతరులతో పోల్చకుండా.. వారిలో దాగివున్న నైపుణ్యాన్ని వెలుగులోకి తీసేందుకు ప్రయత్నించాలి. వారిని ప్రోత్సహించాలి. ఒత్తిడికి గురిచేయకూడదు. ఇలా తల్లిదండ్రులు అందించే నైతిక మద్ధతు వారిని విజయతీరాలకు చేర్చుతుంది.
 
అదే విషయాలను ఒంటపట్టించుకునే నైపుణ్యాన్ని ఇస్తుంది. వీరికి చక్కగా వినే సామర్థ్యం ఉంటుంది. దానికి తగినట్లుగా భావవ్యక్తీకరణ వీరికి తోడైతే అద్భుతాలు సాధిస్తారు. అదే.. విషయాలను ఒంటపట్టించుకునే నైపుణ్యాన్ని ఇస్తుంది. దానికి తగినట్లుగా భావవ్యక్తీకరణా వీరికి తోడైతే అద్భుతాలు సాధించవచ్చు. అందుకే వీలైనంతవరకూ వీరికి నలుగురిలో మాట్లాడే అవకాశాన్ని తరచూ కల్పించాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.