శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : గురువారం, 21 మే 2015 (15:38 IST)

ఉల్లిపాయ ముక్కల్ని పిల్లలు పక్కనబెట్టేస్తున్నారా?

పిల్లలు పండ్లు, కూరగాయల పట్ల అయిష్టత చూపుతారు. వంటల్లో లేదా బర్గర్లలో సైతం ఉల్లి, టమోటా ముక్కల్ని పక్కన తీసిపెట్టేస్తుంటారు. ఇలాంటి వారి కోసం పిల్లలు ఏం చేయాలంటే..? వెజిటబుల్ పకోడీలు, ఫ్రూట్‌క్రీమ్, తరిగిన పండ్ల ముక్కలతో ఐస్‌క్రీమ్‌లు తినిపించే ప్రయత్నం చేయండి. టొమేటో, క్యారెట్, బీట్‌రూట్ వంటి వాటిని ముక్కల రూపంలో కాకుండా జ్యూస్ చేసి ఇవ్వండి. క్యారెట్ లేదా బీట్ రూట్‌ హల్వాను రుచి చూపెట్టండి. 
 
కూరగాయలు, పండ్లు యథాతథంగా తినడం మంచిదే అయినా అసలు లేని దాని కన్నా ఏదో కొంత రూపంలో పిల్లలు ఇలా ఇవ్వడం ద్వారా పండ్లు, కూరగాయల్లో గల పోషకాలు అందుతాయి. పండ్లను అలాగే తినకపోతే.. స్మూతీస్, జ్యూస్‌ల రూపంలో ఇవ్వడం మంచిది. కూరగాయలను సలాడ్ల రూపంలో ఇవ్వడం ద్వారా పిల్లలు మెల్ల మెల్లగా కూరగాయలు, పండ్లు తినడానికి అలవాటు పడతారు.