మీ పిల్లలు ఎదుగుతున్నారు... ఎప్పుడూ అదే ఫుడ్డా... ఇవి పెడితేనే...

child food
Last Modified మంగళవారం, 8 జనవరి 2019 (16:31 IST)
ఇప్పటి తల్లులు పిల్లలికి పొద్దస్తమానం ఏదో బ్యాకరీ షాపులకో లేదంటే స్వీట్ షాపులకో వెళ్లి వాళ్లడిగింది కొనిపెట్టేస్తున్నారు. ఇక ఇంటికి వస్తే వారికి పెట్టేది రొటీన్ ఫుడ్డే. ఏమాత్రం మార్చడంలేదు. దానితో ఎదిగే పిల్లలకు అవసరమైన పోషకాలు అందటంలేదు. ఎదిగే వయసులో పిల్లలకు తప్పక అందించాల్సిన ఆహార పదార్థాలు, వాటిలో వుండే విటమిన్లు ఏమిటో చూద్దాం.

విటమిన్ ఎ: చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఎముక బలానికి కంటి చూపు మెరుగుపడేందుకూ తోడ్పడుతుంది. ఇందుకోసం చీజ్, క్యారెట్, పాలు, కోడిగుడ్లు వాళ్లకి అందించాలి.

బి విటమిన్లు : మొత్తం శరీర పనితీరు బాగుండి చురుగ్గా ఉండాలంటే అన్ని రకాల బి విటమిన్లూ అందేట్టు చూడాలి. మాంసం, చేపలూ, సోయా, బీన్స్ వంటివి ఇవ్వడం వల్ల బి విటమిన్లు అందుతాయి.

కండర పుష్టి: శారీరక దృఢత్వానికీ, అందనైన చర్మానికి విటమిన్ సి చాలా అవసరం. టొమాటోలూ, తాజా కాయగూరలూ, విటమిన్ సి అందించే పుల్లని పండ్లు అందించడంవల్ల విటమిన్ సి లభిస్తుంది.

ఎముక బలానికి: ఎముకలు బలంగా ఉండాలంటే ఆహారంలో క్యాల్షియం ఉండాలి. రాగి మాల్ట్ ఇవ్వాలి. ఇంకా పాలూ, పాల ఉత్పత్తులతోపాటూ ఉదయం వేళ సూర్యరశ్మి పిల్లలకు అందేట్టు జాగ్రత్త తీసుకోవాలి.

ఇనుము లోపం లేకుండా: ఇది రక్తం వృద్ధి చెందేట్టు చేస్తుంది. ఇందుకోసం పాలకూర, ఎండు ద్రాక్ష, బీన్స్ వంటివి తరచూ తీసుకోవాలి.దీనిపై మరింత చదవండి :