మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : శనివారం, 17 జనవరి 2015 (17:21 IST)

పాపాయి కాళ్లకు మసాజ్ ఎలా చేయాలి?

పాపాయి కాళ్లకు మసాజ్ ఎలా చేయాలో తెలుసా? మసాజ్ ప్రారంభించడమే మొదట కాళ్ల నుంచి ప్రారంభించాలి. కొద్దిగా నూనెను ఉపయోగించి, తొడల చుట్టూ చేతులతో మూసి కిందకు లాగండి. దాని తర్వాత ఒక చేతితో, కాలిని పట్టాలి. 
 
ప్రతి దిశలో కొన్ని సార్లు ఒకపాదం తీసుకుని మసాజ్ చేయండి. అప్పుడు స్ట్రోక్ క్రిందికి కాలి చీలమండ నుండి పాదం పైకి చేయండి. పాదం మార్చి పునరావృతం చేయండి. బొటనవ్రేలును ఉపయోగించి పాదాల అడుగు భాగంలో వృత్తాలుగా మసాజ్ చేయండి.
 
కాలివేళ్ళుపాదాలు పూర్తి అయిన తర్వాత, మీ బొటనవేలుతో ప్రతి వేలును పట్టుకొని లాగండి. చూపుడు వేలును వేళ్ళతో చివరి వరకు పట్టుకొని లాగండి. ఈ విధంగా అన్ని కాలి వేళ్ళను లాగండి ఇలా మెల్ల మెల్లగా పాపాయికి మసాజ్ చేస్తే పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. 
 
ఇలాగే పాపాయి శరీరం మొత్తం రోజు మార్చి రోజు నూనె లేదా ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయడం ద్వారా బుజ్జి పాపాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.