శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Chitra
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2015 (15:46 IST)

పిల్లల్ని ప్లే గ్రౌండ్స్‌లో ఆడనివ్వండి.. ఆరోగ్యంగా ఉంచండి!

క్రీడల వల్ల పిల్లలకు చాలా లాభాలున్నాయి. ఆటలు పిల్లల జీవితాలలో ప్రధాన పాత్రను పోషిస్తోంది. క్రీడల వల్ల పిల్లలకు ఎన్నో ఉపయోగాలున్నాయి. నిజానికి, పిల్లలని ప్లేగ్రౌండ్‌కు అలవాటు చేయడం ఎంతో మంచిది. ఆరోగ్యకరంగా మీ పిల్లలు ఉండాలంటే వారికి క్రీడలను అలవాటు చేయాలి. ఈ తరం పిల్లలు క్రీడలను దూరంగా ఉంచడం వల్ల అధిక బరువుతో బాధపడుతున్నారు. 
 
దీనికి కారణం పాఠశాలలో మైదానాలు లేకపోవడం, ఇంట్లో ఆడుకుందామంటే సరైన స్థలాలు లేకపోవడం, ఇలాంటి సమస్యల వల్ల పిల్లలు అలుపెరగకుండా ఊబకాయ సమస్యతో బాధపడుతు‌న్నారు. అటువంటి సమస్యలను అధిగమించాలంటే కచ్చితంగా పిల్లలకంటూ క్రీడలలో పాల్గొనే అలవాటు చేయాలి. పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు క్రీడలు ఉపయోగపడతాయి. పిల్లలు నిత్యం అలుపెరిగేలా ఆడితేనే ఆరోగ్యంగా ఉంటారని పరిశోధనలలో వెల్లడించారు. 
 
తల్లితండ్రులుగా, పిల్లలకు క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలని మీరు తప్పక తెలుసుకోవాలి. మీ పిల్లలకి శ్రమ కలిగేలా ఆడించాలి. ఆటలంటే వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్ లాంటివి కాకుండా శారీరక శ్రమ కలిగించే ఫుట్ బాల్ వంటి ఆటలు ఆడించాలి. పిల్లలకి ఆటలు దూరంగా ఉంచడమంటే వారిని ఆరోగ్యం నుంచి దూరంగా ఉంచడమేనని తేటతేల్లమవుతుంది. క్రీడలలో పాల్గొనే పిల్లలు అన్నింట్లోను చురుగ్గా ఉంటారని వైద్య నిపుణులు అంటున్నారు. అంతేగాక పిల్లలు చదువులో కూడా ఎంతో చురుకుగా ఉంటారు. క్రీడల వల్ల కలిగే ఉపయోగాల గురించి చూద్దాం. 
 
* క్రీడలలో పాల్గొనే పిల్లలు చురుగ్గా ఉంటారు. వివిధ అంశాలపై ఫోకస్ ను మెయింటైన్ చేయగలుగుతారు.
* ఆటలు, వ్యాయామం మూలంగా శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. అధిక బరువు ఊబకాయం నుండి విముక్తి కలుగుతుంది. దీంతో  పిల్లలు అధికబరువు పెరగకుండా నాజూగ్గా ఉంటారు.
* నడక, జాగింగ్, చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతుంది.
* ఆటల వల్ల మధుమేహవ్యాధి సమస్యలు రావు.
* శారీరకంగా ఫిట్‌గా ఉన్న పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అన్నిపనులలో చురుగ్గా ఉంటారు.