శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By
Last Updated : శనివారం, 10 నవంబరు 2018 (11:25 IST)

పిల్లలకు మైక్రోవేవ్‌లో చేసిన వంటలొద్దు..

పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు.. మైక్రోవేవ్‌లో చేసిన వంటలొద్దు అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేసి పిల్లలకు తినిపించకూడదు. తాజాగా మైక్రోవేవ్‌లో వండిన అన్నాన్ని తినిపించవచ్చు. మైక్రోవేవ్‌లో ఆహారం వేడిచేస్తే మొదట కొద్దిగా మీరు రుచి చూసిన తర్వాతే పిల్లలకు పెట్టాలి. అలాగే పిల్లకు ఆహారం పెట్టే వస్తువులు శుభ్రంగా వుండేలా చూసుకోవాలి. 
 
సరైన సమయానికి పిల్లలకు ఆహారం అందించాలి. ప్లాస్టిక్ వస్తువుల్లో అన్నం తినిపించడం చేయకూడదు. పిల్లలకు అన్నం తినిపించేటప్పడు వెనుకభాగం బాగా ఎత్తుగావుండే ట్రే ఆకారం కుర్చీలో కూర్చోబెట్టి తినిపించాలి. 
 
పిల్లలు టేబుల్‌పై తినేటప్పుడు వేడి పదార్ధాలు టేబుల్‌పై ఉంచొద్దు. అరటిపళ్లు, కమలాల తొక్క సులువుగా తీయొచ్చు కాబట్టి వాటిని కడగకుండా కూడ పిల్లల చేతికి ఇవ్వొచ్చు. వేడి పదార్థాలు వడ్డించేటప్పుడు అవి పసిపిల్లలు తినగలగలిగిన ఉష్ణోగ్రతలోనే ఉన్నాయా లేదా చూసుకోవాలి. కాస్త గోరువెచ్చని ఆహారాన్ని పిల్లలకు తినిపిస్తే ఆహారం వారికి సులభంగా జీర్ణమవుతుందని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.