శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : బుధవారం, 18 మార్చి 2015 (16:55 IST)

పాపాయికి డైపర్ వాడుతున్నారా? రాషెస్‌కు వెనిగర్ వాడితే బెస్ట్..!

వెనిగర్ ఒక యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్. డైపర్ రాషెస్‌ను నివారించాలంటే ఒక కప్పు వాటర్‌లో ఒక టీస్పూన్ వైట్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసి, డైపర్ మార్చిన ప్రతి రి ఈ మిశ్రమంతో బేబీ బాటమ్ ప్లేస్‌ను శుభ్రంగా తుడుస్తుండాలి.  కార్న్ స్టార్చ్ చర్మాన్ని డ్రైగా ఉంచి, బేబీలో రాషెస్ ఏర్పడకుండా సహాయపడుతుంది. క్లీన్ డైపర్ ను తొడగడానికి ముందు బేబీ సిస్టింగ్ పోచ్చర్ మీద గోరువెచ్చని నీటిని చిలకరించి కొద్దిగా కార్న్ స్టార్చ్ చిలకరించాలి. 
 
డైపర్ రాషెస్ నివారణకు కొబ్బరి నూనెలో యాంటీ ఫంగర్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని ఒక సమర్థవంతమైన హోం రెమెడీగా ఉపయోగించుకోవచ్చు. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని డైపర్ ఏరియాలో అప్లై చేయాలి. రోజులో రెండు మూడు సార్లు అప్లై చేయవచ్చు. డైపర్ రాష్ ప్రభావిత భాగంలో ఆలివ్ నూనె రాయటం వలన నయం చేయుటలో సహాయపడుతుంది. 
 
షీబటర్‌ను కొద్దిగా తీసుకొని, రాషెస్ ఉన్న ప్రదేశంలో సున్నితంగా మర్ధన చేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచిది తర్వాత కొత్త డైపర్‌ను తొడగాలి. అలాగే ఆలివ్ నూనె చర్మంను తేమగా ఉంచుతుంది. పొడి ప్రాంతంలో ఆలివ్ నూనెను రాయాలి. నూనెను రాయటం వలన చర్మం మీదకు వచ్చే నీటిని నిరోధిస్తుంది. తద్వారా రాషెస్‌ను దూరం చేసుకోవచ్చునని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.