మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (17:53 IST)

పిల్లల్ని ఇంట్లోనే బంధించకండి.. అలా పార్కుకు తీసుకెళ్లండి!

పిల్లల్ని ఇంట్లోనే బంధించకుండా అలా పార్కుకు తీసుకుని.. ప్రకృతితో మమేకం చేయండి. కంప్యూటర్ గేమ్స్‌, సెల్ ఫోన్స్‌కే అంకితం కాకుండా పార్కుల్లో ఆడుకునేలా చేయండి. పక్కింటి, ఇరుగు పొరుగు వారి పిల్లలలో సురక్షితంగా ఆడుకోనివ్వండి. 
 
పిల్లలను సంతోషపెట్టాలంటే.. ప్రతిసారి ఏవైనా చిన్న చిన్నవి కొనిపెట్టండి. ఒక చాక్లెట్ లేదా చిప్స్ కొనిచ్చినా వారి సంతోషానికి అవధులు ఉండవు. అప్పుడప్పుడూ వారికవసరమైన వస్తువులని కొనిపెట్టండి. వారికి నచ్చిన రంగులో ఉండే ఐ పాడ్, లేదా టీనేజ్ పిల్లలకి అవసరమైన కంప్యూటర్ వంటివి కొనివ్వండి. 
 
వారు ఎప్పటినుంచో కావాలని ఆశ పడుతున్న వస్తువులని వారి పుట్టినరోజు కానుకలుగా ఇవ్వండి. అప్పుడప్పుడూ సరదాగా డిన్నర్‌కి, ఏదైనా మూవీకి తీసుకెళ్ళండి. ఉద్యోగానికి వెళ్లే తల్లిదండ్రులు.. ఇంటికొచ్చాక వారిపై శ్రద్ధ పెట్టండి. 
 
మళ్లీ ఇంటిపనుల్లో ఇతరత్రా పనులపై దృష్టి మళ్లించకుండా పిల్లలతో గంటపాటైనా గడిపేలా చూసుకోండి.. ఇలా చేస్తే పిల్లలపై ప్రతికూల ప్రభావాలు ఉండబోవని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.