శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : గురువారం, 16 అక్టోబరు 2014 (15:30 IST)

పాటెర్నిటీ లీవ్స్ డాడ్స్ తీసుకోవచ్చు.. సంకోచం ఎందుకు?

చాలామంది ఫాస్ట్ ట్రెండ్ కారణంగా పాటెర్నిటీ లీవ్స్ తీసుకోకుండా మానుకుంటున్నారు. తమ సతీమణి ప్రెగ్నెంట్ డెలివరీ సమయంలో ఆమె పక్కనే ఉండి చూసుకోవాల్సిన పురుషులు పాటెర్నిటీ లీవ్స్ అంటేనే షైగా ఫీలైపోతున్నారు. ఆ లీవ్స్ వేసుకోవడం కంటే ఆఫీసుకే వెళ్లిపోదామనుకుంటున్నారు. 
 
కానీ ఆధునిక యుగంలో సంబంధాల మెరుగుపరిచేందుకే మహిళలకే కాకుండా   పురుషులకు కూడా పాటెర్నిటీ లీవ్స్ ఇస్తున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు.  ఈ పాటెర్నిటీ లీవ్స్ తీసుకోవడానికి సంకోచించాల్సిన అవసరం లేదంటున్నారు. 
 
ఆఫీసు ఒత్తిడి, కొత్త ప్రాజెక్టుల భయం, విదేశాల ప్రయాణం వంటి ఇతరత్రా కారణాల చేత పురుషులు పాటెర్నిటీ లీవ్స్‌కు సంకోచించడంతో పాటు తాము తండ్రి అయ్యామనే వార్తను కూడా దూరంగా ఉండే వింటున్నారు. 
 
ఇందుకు ఏకైక పరిష్కారం మహిళలతో పాటు పురుషులు కూడా పాటెర్నిటీ లీవ్స్ తీసుకోవడమే. వివాహబంధంతో ఒకటైన జంటకు సంతానం ద్వారా పరిపూర్ణత లభిస్తుందని, అందుకే భార్యకు ప్రసవం సమయంలో చేయూత నివ్వాలని, తమ వంతు సాయం చేయాలనే దిశగా పాటెర్నిటీ లీవ్స్‌ను అమల్లోకి తెచ్చినట్లు మానసిక నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా చెప్పాలంటే.. పాటెర్నిటీ లీవ్స్ తీసుకుంటే.. ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన పని లేదు. అందుచేత వారమో లేదా రెండు వారాలో పురుషులు కూడా పాటెర్నిటీ లీవ్స్ తీసుకుంటే.. కుటుంబంపై బాధ్యత కలిగివారవడంతో ఈ లోకాన్ని అప్పుడే కళ్లుతెరచి చూసే శిశువుకు తండ్రిపై మరింత మమకారం పెరుగుతుందని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు.