శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చైనీస్
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (12:17 IST)

పైనాపిల్ మిల్క్ షేక్ తయారీ విధానం...?

ఈ కాలంలో పైనాపిల్ ఎక్కువగా లభిస్తుంది. పైనాపిల్లో విటమిన్స్, ప్రోటీన్స్, న్యూట్రియన్స్ అధిక మోతాదులో ఉంటాయి. దీనిని తరచు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి ఎనర్జీని అందిస్తుంది. బరువును తగ్గిస్తుంది. పిల్లలు పైనాపిల్ అంటే చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి పైనాపిల్‌తో మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు:
అనాస పండు రసం - 2 కప్పులు
దాల్చినచెక్క పొడి - అరస్పూన్
తేనె - 2 స్పూన్స్
పాలు - అరకప్పు
పెరుగు - 1 కప్పు.
 
తయారీ విధానం:
ముందుగా తేనె, పాలు, పెరుగు మిక్సీలో వేసుకుని మెత్తని మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఇలా చేసిన మిశ్రమంలో అనాసపండు రసం, దాల్చిన చెక్క పొడి కలిపి గ్లాసులోకి తీసుకుంటే చాలు.. టేస్టీ అండ్ హెల్తీ పైనాపిల్ మిల్క్‌షేక్ రెడీ...