శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 నవంబరు 2016 (16:24 IST)

చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నారా? పాలపొడిని కలిపితే..?

ఆదివారం చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నారా? అయితే చికెన్ వేయించేటప్పుడు చక్కని రంగులో రావాలంటే మొక్కజొన్న పిండికి బదులు పాలపొడిని కలిపి ఫ్రై చేసుకుంటే టేస్ట్‌తో పాటు రంగు కూడా అదిరిపోతుంది. ఆలు, బెండకాయలత

ఆదివారం చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నారా? అయితే చికెన్ వేయించేటప్పుడు చక్కని రంగులో రావాలంటే మొక్కజొన్న పిండికి బదులు పాలపొడిని కలిపి ఫ్రై చేసుకుంటే టేస్ట్‌తో పాటు రంగు కూడా అదిరిపోతుంది. ఆలు, బెండకాయలతో వేపుళ్ళు చేస్తున్నప్పుడు అవి అడుగు అంటకుండా ఉండాలంటే, ముందు మూకుడును బాగా వేడిచేసి ఆ తరువాతే నూనె వేయాలి.
 
పప్పులు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే నిలువ ఉంచే డబ్బాల అడుగున నాలుగు వెల్లుల్లి రేకలు వేస్తే సరి. అలాగే గారెలు కరకరలాడుతూ రావాలంటే వాటిని చేతితో అద్దేటప్పుడు పుల్లని మజ్జిగతో అద్దితే సరిపోతుంది. 
 
పచ్చి బఠాణీ నిల్వ ఉండాలంటే వస్త్రంలో మూటకట్టి ముందుగా వేడినీళ్ళలో మూడు నిముషాల పాటు, మరో మూడు నిమిషాలపాటు చల్లటి నీటిలో ముంచాలి. తరవాత ఎండలో బాగా ఆరబెట్టాలి. ఇప్పుడు వాటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టండి. తేనెలో నాలుగు మిరియాల గింజలు వేసి భద్రపరిస్తే చీమలు దరిచేరవు.