శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (18:12 IST)

సొరకాయ గుజ్జుతో దోసెలు పోస్తే..!

మరుగుతున్న 'టీ' పొడిలో చిటికెడు శొంఠి పొడి, రెండు యాలుకలు వేసి, 'టీ'ఇస్తే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
లేత సొరకాయ తరిగినపుడు లోపల ఉండే మెత్తని గుజ్జును బాగా నానిన బియ్యానికి జోడించి మెత్తగా రుబ్బాలి. అందులో అల్లం, మిర్చి, ఉల్లిపాయముక్కలు, తగినంత ఉప్పు కలిపి దోసెలు పోస్తే రుచిగా ఉంటాయి. 
 
వేపుడులో నూనె ఎక్కువైతే కాస్త శనగపిండి చల్లండి. తినడానికి రుచిగా ఉండటమే కాక ఎక్కువయిన నూనె తగ్గుతుంది కూడా.